వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం కానుంది. రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కేటీరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొంటారు.
వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి... అవసరమైన సూచనలు ఇవాలని ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారు. అందులో భాగంగా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సబ్ కమిటీ సమావేశం కానుంది. రిజిస్ట్రేషన్ల అంశానికి సంబంధించి వారి అభిప్రాయాలు, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోవడమే కాకుండా... సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారు.