ETV Bharat / city

ఆస్తుల నమోదు సమయంలో ఆధార్‌ అడగొచ్చు: ప్రభుత్వం - high court news

non agriculture assets registration petition hearing in high court
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Dec 21, 2020, 3:40 PM IST

Updated : Dec 21, 2020, 6:56 PM IST

15:36 December 21

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ

ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నవంబర్‌ 3న ఉన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే.  

సాగుభూముల యజమానుల ఆధార్‌, కులం వివరాలకు ఒత్తిడి చేయొద్దని స్టే విధించిన సందర్భంగా కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టేను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు వెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.  

సాగుభూములపై సబ్సిడీ పథకాలు అమల్లో ఉన్నందున ఆధార్‌ వివరాలు అడగొచ్చని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఆధార్‌ను గుర్తింపుకార్డుగా పరిగణించవచ్చంటూ చట్టం పేర్కొంటున్న విషయాన్ని తెలిపింది.  

దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన వెకేట్‌ పిటిషన్‌పై అభ్యంతరాలను ఈనెల 31లోపు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది. అనంతరం ధరణి పిటిషన్లపై విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.  

ఇదీ చూడండి: అమెరికా చికాగోలో హైదరాబాదీపై కాల్పులు..

Last Updated : Dec 21, 2020, 6:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.