ETV Bharat / city

వాహన రిజిస్ట్రేషన్‌ పక్కాగా లేకపోతే ఇంక తిప్పలు తప్పవు

Vehicle registrations ఇక మీరు ఎటువంటి వాహనం కొన్న తప్పనిసరిగా రిజిస్ట్రేషన్​ చేయించుకోవాలి. అలా చేయకపోతే రూ. 30వేలు వరకు పన్ను పడే అవకాశం ఉంది. ఎప్పుడు వాహనం కొనుగోలు చేశారు, పాత వాహనం ఎవరికీ అమ్మారు, మీరు కొత్తది ఎప్పుడు తీసుకున్నారు అన్న విషయాలు అన్నీ నమోదు చేయించుకోవాలి. దీని కోసం రవాణాశాఖ ఇటువంటి రిజిస్ట్రేషన్​లను సులభతరం చేసింది.

vehicle registration
వాహనాల రిజిస్ట్రేషన్​
author img

By

Published : Aug 30, 2022, 11:46 AM IST

Vehicle registrations: ‘సర్‌, ఇరవైఏళ్ల క్రితం ఒక బైక్‌ కొన్నారు. ఇప్పుడు కారు కొంటున్నారు. అదనంగా రూ.30వేలు పన్ను కట్టాలి.. లేదంటే మీ బైక్‌ను ఎవరికైనా వెంటనే విక్రయించండి.. అదేంటి.. మీ బైక్‌ మీ వద్ద లేదా? 18 ఏళ్ల క్రితమే అమ్మేశారా? మరి మీ బైక్‌ కొన్న వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. ఇప్పుడు కారు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే. మా కంప్యూటర్‌లో రెండో వాహనం ఉన్నట్టు చూపిస్తోంది. రూ.30 వేలు పన్ను కట్టక తప్పదు’ ఖైరతాబాద్‌లోని ప్రాంతీయ రవాణాశాఖ అధికారి కొత్త కారు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వచ్చిన ఒక పోలీస్‌ అధికారితో అన్నమాటలివి. ఎలాంటి వాహనాన్ని విక్రయించినా వెంటనే కొన్నవారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించాలి. లేదంటే కొత్త కారు కొనేందుకు మీ బైక్‌ను అమ్మేస్తున్నా, బైక్‌ మరీ పాతబడిపోయిందని కొత్త వాహనం కొంటున్నా, వీటి అన్నింటికీ అదనంగా పన్ను చెల్లించాలని రవాణాశాఖ అధికారులు అంటున్నారు. మీ వద్ద వాహనం కొన్న వ్యక్తులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా, ప్రమాదాలు చేసినా మీరే బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నారు.
భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులివే:

  • మీ వద్ద వాహనం కొన్న వ్యక్తి ఎన్నిసార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే అన్ని చలాన్‌లు మీకువస్తాయి. చెల్లించకపోతే ట్రాఫిక్‌ పోలీసులు మీకు సమన్లు జారీ చేసి మిమ్మల్ని కోర్టులో హాజరుపర్చే అవకాశాలున్నాయి.
  • వాహనాల యజమానులు, వాహనం నడుపుతున్నవారు వేర్వేరుగా ఉండడం వల్ల శాంతి భద్రతల సమస్యలతోపాటు ప్రమాదాల ఘటనలనప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహన చోదకులు ప్రమాదం చేసి వాహనాలను వదిలేసి పారిపోతే నంబరు ఆధారంగా వాహన యజమానినే నిందితుడిగా పోలీసులు భావిస్తారు.
  • ప్రమాదవశాత్తు వాహనదారుడు చనిపోతే.. సమాచారం చెప్పేందుకు బైక్‌/కారు నంబర్‌ ఆధారంగా యజమానికి చెబితే ఆ పొరపాటుకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
  • సెకెండ్‌ హ్యాండ్‌ లేదా ఫైనాన్స్‌లో ద్విచక్ర వాహనం లేదా కారు కొన్నవారు వెంటనే ఆ వాహనాన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో కొన్నవారి పేరు మీద మార్పించాలి. లేదంటే పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్‌ పత్రాలు కొన్న వారి పేరు మీద లేకపోతే మోటార్‌ వాహన చట్టం ప్రకారం పాత వాహనదారులకు సమన్లు జారీ చేస్తారు.
  • ప్రీ ఓన్డ్‌కార్లు ద్విచక్ర వాహనాలు సెకెండ్‌హ్యాండ్‌గా విక్రయించే వ్యక్తులు, సంస్థలు వెంటనే కొన్నవారి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయించాలి. లేదంటే సదరు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు రవాణాశాఖ రికార్డుల ప్రకారం ఈ-చలాన్‌ వాహన యజమాని చిరునామాకే వెళ్తుంది. మాకేం సంబంధం అనుకుని వాటిని చెల్లించకపోతే పోలీసులు న్యాయస్థానంలో సమర్పించే అభియోగపత్రాల ద్వారా జైలుకు వెళ్లే అవకాశాలున్నాయి.
    సులువుగా యాజమాన్య బదిలీ
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో సెకెండ్‌ హ్యాండ్‌ వాహనాలు ఆరు లక్షలనుంచి తొమ్మిది లక్షలుంటాయని రవాణాశాఖ అంచనా. యాజమాన్య బదిలీ చేయించాలంటే ప్రతి ఒక్కో వాహనం నిలిపి తనిఖీలు నిర్వహించాలి. ఇది సాధ్యం కాదు. అందుకే యాజమాన్య బదిలీని సులభతరం చేసింది. తమ వాహనాలు ఇవిక్రయిస్తున్నవారు, గతంలో విక్రయించిన వారు..

ఎలా చేయాలి.. రవాణాశాఖ వెబ్‌సైట్‌ లేదా ‘టీ’యాప్‌లో ప్రవేశించి ‘ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ఓనర్‌ షిప్‌’ ఐచ్ఛికం ఎంచుకోవాలి. అందులోనే ఫామ్‌-30 డౌన్‌లోడ్‌ చేసుకుని ఆన్‌లైన్‌ ద్వారా యాజమాన్య మార్పిడి తేదీ ఎంపిక చేసుకోవాలి. ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్‌ పత్రం, ఇతర పత్రాలను రవాణా కార్యాలయంలో సమర్పిస్తే వారంలో యాజమాన్య బదిలీ పత్రం వాహనం నడుపుతున్నవారి చిరునామాకు పోస్టు ద్వారా చేరుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.