రేషన్ కార్డుదారుల ఖాతాల్లో ప్రభుత్వం 1500 రూపాయల నగదు జమ చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలు... ఆ డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. వికారాబాద్ జిల్లా సూరారంలో బ్యాంకుకు వచ్చినవారికి టోకెన్లు ఇచ్చినప్పటికీ... భౌతిక దూరం పాటించకుండా లైనులో నిలబడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన డబ్బులు వెంటనే తీసుకోకపోతే వెనక్కి వెళ్లిపోతాయనే అపోహతో అందరూ ఒకేసారి వచ్చారు. ప్రజలు గుంపులుగుంపులుగా బ్యాంకు వద్దకు చేరుకోవడం వల్ల వారిని అదుపుచేయడం బ్యాంకు అధికారులకు, పోలీసులకు తలనొప్పిగా మారింది.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్