పంపిణీ చేసేందుకు ప్రభుత్వభూమే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భూములు పంపిణీ చేస్తామని అసత్యాలు చెప్పమన్నారు. భూములు క్రమబద్ధీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కౌలుదారి వ్యవస్థను పట్టించుకోమని పేర్కొన్నారు. రైతులకు అండదండగా ఉండటమే తమ పాలసీ అని తెలిపారు.
వీఆర్వో వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబురాలు చేసుకున్నారని కేసీఆర్ తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వానికి భూమిశిస్తు ప్రధాన ఆదాయ వనరని గుర్తు చేశారు. ఇప్పుడు దానిని రద్దు చేశామన్నారు. ప్రభుత్వమే రైతుబంధు అందిస్తున్నప్పుడు అనుభవదారు కాలం అవసరమే లేదని సీఎం స్పష్టం చేశారు.
జాగీర్దార్ల వ్యవస్థ ఉన్నప్పుడు అనుభవదారు కాలం సరైనదేనని అన్నారు. ఇప్పుడు అనుభవదారు కాలంతో సన్న, చిన్నకారు రైతులకు నష్టమని చెప్పారు. వీలైనంత త్వరగా సమగ్ర భూసర్వే చేస్తామని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్