ప్రతి ఏటా సందడిగా ఉండే బతుకమ్మ పండుగ.. కరోనా వల్ల ఎవరింట్లో వారే జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ ఆడపడుచులంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ.. పండుగ జరుపుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కల్వకుంట్ల కవిత వీడియో సందేశం విడుదల చేశారు. ఓవైపు కరోనా.. మరోవైపు అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. ఒకరికొకరు అండగా నిలుస్తూ బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాలని కోరారు. గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని, భాగ్యనగర వాసుల ఇక్కట్లు తొలగాలని ఆకాంక్షించారు. వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లు విడుదల చేయడం సంతోషకరమని తెలిపారు.
-
పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు #MyBathukammaMyPride #Bathukamma pic.twitter.com/hYXjEgyFKQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు #MyBathukammaMyPride #Bathukamma pic.twitter.com/hYXjEgyFKQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 24, 2020పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు #MyBathukammaMyPride #Bathukamma pic.twitter.com/hYXjEgyFKQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 24, 2020