ETV Bharat / city

గోదావరి జిల్లాల రైతులను వెంటాడుతున్న విపత్తులు - నివర్ తుపాను వార్తలు

గోదావరి జిల్లాలను విపత్తులు వెంటాడుతూనే ఉన్నాయి. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. భారీ వర్షాలు, గోదావరి, ఏలేరు భీకర వరదలు... అన్నదాతల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు పంటల్ని సర్వనాశనం చేశాయి. తాజాగా గోదావరి జిల్లాలపై అంతగా ప్రభావం చూపదని భావించిన నివర్ తుపాను రైతులపై కక్షగట్టింది. ముమ్మరంగా వరి కోతలు సాగుతున్న సమయంలో ఈదురు గాలులతో రైతులోకానికి తీరని నష్టాన్ని చేకూర్చింది.

nivar
nivar
author img

By

Published : Nov 29, 2020, 7:41 AM IST

గోదావరి జిల్లాల రైతులను వెంటాడుతున్న విపత్తులు

తూర్పుగోదావరి జిల్లాపై ఈ ఖరీఫ్ ప్రారంభం నుంచి విపత్తులు విరుచుకుపడ్డాయి. జులైలో భారీ వర్షాలతో ఖరీఫ్ ప్రారంభమైంది. ఆగస్టులో గోదావరికి వరదలు వచ్చాయి. 15 రోజులకుపైగా వరద తగ్గలేదు. 23 లక్షల క్యూసెక్కుల వరద నీరు నది తీరప్రాంతాల్లోని పంటల్ని ముంచేసింది. మన్యం నుంచి కోనసీమ వరకు అపార నష్టాన్ని మిగిల్చింది. సెప్టెంబరులో ఏలేరుకు భారీ వరద రాగా.. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోని వరి, ఉద్యానవన, పంటలు వరదపాలయ్యాయి. అక్టోబరులో జిల్లాలో కుంభవృష్టి వానలు కురిశాయి. ఫలితంగా... కాకినాడ, రామచంద్రపురం డివిజన్​లలో పంటలు మునిగాయి. వాగులు వంకలు పొంగి వరి, ఉద్యాన, వాణిజ్య పంటల్ని ముంచేశాయి. ఇప్పటి వరకు 1లక్షా 80 వేల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా నివర్ తుపాన్ సాగుదారుల వెన్ను విరిచేసింది. కోతకోసిన, కోతకొచ్చిన వరి పంటకు అపార నష్టాన్ని కలిగించింది.

దయనీయంగా కౌలుదారుల పరిస్థితి

కోనసీమలో వరి పంట నీట మునిగింది. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో వరి నీటి పాలయింది. కాకినాడ డివిజన్ పరిధిలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని గోదావరి మధ్య డెల్టాలోనూ, శివారు ప్రాంతాల్లోనూ వరి వర్షార్పణమైంది. రాజమహేంద్రవరంలోని వరి కోత కోయని ప్రాంతాల్లోనూ పంట నేలకొరిగింది. నివర్ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట, ధాన్యం 1.43 వేల ఎకారాల్లో నీటి పాలయింది. సుమారు 4 వేల 5 ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు మునిగాయి. జిల్లాలో గోదావరి డెల్టాతోపాటు మెట్ట ప్రాంతంలోనూ 80 శాతంపైగా కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు. ఏటా వెంటాడుతున్న విపత్తులతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం భూ యజమానులకే దక్కడంతో కౌలుదారుల పరిస్థితి దయనీయంగా మారిపోతోంది.

వేలాది ఎకరాల్లో పంట జలార్పణం

నివర్ ప్రభావం పశ్చిమగోదావరి జిల్లాపై చాలానే పడింది. కొవ్వూరు, నిడదవోలు, భీమడోలు, భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆచంట తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. పొగాకు, పత్తి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 47 మండలాల్లోని దాదాపు 21,234 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 4.60లక్షల ఎకరాల్లో వరిపంట సాగుచేయగా.. ఇందులో మూడు లక్షల ఎకరాలు కోతలు కోయాల్సి ఉంది. వర్షాల వల్ల.. మూడువేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో సాగు చేస్తున్న 5.55 లక్షల ఎకరాల్లో సుమారు 3.50 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. వీరిలో దాదాపు 2 లక్షల మంది కౌలుదారులే. వీరు ఎకరానికి సగటున 22 వేల రూపాయల చొప్పున దాదాపు 1,221 కోట్లు పెట్టుబడి పెట్టారు. అనుకూల వాతావరణం ఉంటే 14.04 లక్షల టన్నులకు మించి దిగుబడి వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. అక్టోబరులో కురిసిన వర్షాలతో కొల్లేరు, ఉప్పుటేరు, ఎర్రకాలువ, తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు, నక్కల, కాజ తదితర డ్రెయిన్ల పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంట జలార్పణమైంది. మిగిలిన చోట్ల ఎకరానికి 15-20 బస్తాల దిగుబడి రావడం కూడా గగనమవుతోంది.

నీటిలోనే వేలాది ఎకరాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆక్వా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వాతావరణం పూర్తిగా చల్లబడటంతో చెరువుల్లో ప్రాణవాయువు స్థాయిలు పడిపోతే రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉన్నందున నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ రసాయనాలు చల్లిస్తున్నారు. ఇంకా వేలాది ఎకరాలు నీటిలోనే మునిగిపోయాయి. ఇదే పరిస్థితి మరో ఒకట్రెండు రోజులు కొనసాగితే నీటిపాలైన ధాన్యం రంగు మారే ప్రమాదముంది. ఫలితంగా... ధర తగ్గి అప్పుల పాలు అవ్వాల్సిందేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండటం... మళ్లీ తుపాను హెచ్చరికలతో తడిసిన వరి పంట, ధాన్యం ఆరబెట్టుకోవడం రైతులకు కష్ట సాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో... ఎండ కోసం వారంతా ఆకాశం వైపు, సాయం కోసం ప్రభుత్వం వైపు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి : ట్రంప్ వచ్చి ప్రచారం చేసినా తమకు నష్టం లేదు: అసదుద్దీన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.