కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నిర్మలకు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బయల్దేరి వెళ్లారు. అనధికారిక కార్యక్రమం కావడంతో మంత్రి పర్యటన చివరి వరకు బయటకు తెలియలేదు. గతంలో తన వద్ద వ్యక్తిగత పీఏగా పని చేసిన పేరాల మోహన్ కుమార్తె వివాహానికి ఆమె హాజరయ్యారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఈ వివాహానికి హాజరయ్యారు. నిర్మలా సీతారామన్ రేపు మధ్యాహ్నం విజయవాడ నుంచి హైదరాబాద్ రానున్నారు.
ఇదీ చదవండి: ఇండస్ట్రియల్ పార్కుల్లో భూములకు ధరాఘాతం.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలపై పిడుగు