ETV Bharat / city

అలా అడిగిన వారికి.. నా రెండో బిడ్డని చెబుతా..!!

జీవితంలో ఓ అసంతృప్తి. దానికి దూరమవ్వడానికి సేవను మార్గంగా ఎంచుకున్నారు ఏపీకి చెందిన నిర్మలా మురళి. నలుగురికీ సాయపడటంలో ఉన్న ఆనందం అర్థమయ్యాక దాన్నో అలవాటుగా చేసుకున్నారు. మతిస్థిమితం లేని పిల్లలకు, అనాథలకు అమ్మగా, విద్యార్థులకు టీచరమ్మగా.. అవసరాన్ని బట్టి ఆయా పాత్రల్లోకి ఒదిగిపోతున్నారు. తన సేవా ప్రయాణం.. ఆవిడ మాటల్లోనే..

Nirmala Murali
నిర్మలా మురళీ
author img

By

Published : Jul 27, 2022, 12:38 PM IST

మాది ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం. డిప్లొమా పూర్తికాగానే 1999లో పెళ్లి చేసేశారు. మావారు పురుషోత్తమ మురళీకృష్ణ నిర్మాణ రంగంలో ఉన్నారు. నేను చదివింది సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగమే కావడంతో పైచదువులకు ప్రోత్సహించారు. ఆయన సహకారంతోనే ఎంటెక్‌ వరకూ చదివా. అన్ని విషయాలూ అంతే సాఫీగా సాగిపోతే జీవితమెందుకు అవుతుంది? పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. బాధ, అసంతృప్తి కమ్మేశాయి. దీనికి తోడు చుట్టూ ఉన్నవాళ్ల నుంచి సూటిపోటి మాటలూ.. తట్టుకోలేకపోయేదాన్ని. వీటి నుంచి బయటపడటానికని ఓ స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా చేరా. మతిస్థిమితం లేని, ఆటిజం లక్షణాలున్న పిల్లలు అక్కడ ఆశ్రయం పొందేవారు. ఉదయం వెళితే సాయంత్రం వరకూ అక్కడే! వారితోనే ఉండేదాన్ని. దాంతోపాటు వీలు కుదిరినప్పుడల్లా చిన్నచిన్న సేవా కార్యక్రమాలూ చేస్తుండేదాన్ని. అవన్నీ చాలా సంతృప్తినిచ్చేవి. ఆ చిన్న పిల్లల ప్రేమో, వాళ్ల తల్లిదండ్రుల ఆశీర్వాదమో తెలియదు కానీ.. పెళ్లైన ఏడేళ్లకు 2006లో బాబు పుట్టాడు. నేను చేసిన సేవకు ప్రతిఫలమే ఈ అదృష్టానికి కారణమనుకున్నా. అందుకే వాటిని కొనసాగించాలని నిర్ణయించుకున్నా.

బాబు పుట్టేనాటికి ఇంజినీరింగ్‌ మాత్రమే చేశా. అందుకే భారీగా సేవా కార్యక్రమాలు చేయడం నా ఉద్దేశం కాదు. నా ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా వీలైనంత వరకూ సాయమందించాలనుకున్నా. అందుకోసమే ఉద్యోగంలోనూ చేరా. తెలిసిన వారు ఆపదలో ఉన్నా, ఆర్థిక సాయం అవసరమైనా సాధ్యమైనంత సాయమందించడానికి ప్రయత్నించేదాన్ని. ఉద్యోగం చేస్తూనే ఎంటెక్‌ చేశా. పూర్తయ్యాక స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరాను. ఆ సమయంలో నా డిపార్ట్‌మెంట్‌లో సెమిస్టర్‌కి ఇద్దరు చొప్పున పేద విద్యార్థులను ఎంపిక చేసుకుని వారి చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సాయం అందించాను. సింగిల్‌ పేరెంట్‌ ఉన్న, ఆర్థికంగా వెనకబడిన వారిని ఎంచుకుంటా. వారంతా ఇప్పుడు మంచి స్థానాల్లో ఉన్నారు. మా దగ్గర బీసీ, ఎస్సీ హాస్టళ్లలో పిల్లలకు చదువులో సాయం అవసరమనిపించింది. నా విద్యార్థులను పోగుచేసి వారితో వాళ్లకు ట్యూషన్లు చెప్పించేదాన్ని. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నా. వాళ్లకి ఉన్నత చదువులు, ఇతర విషయాల్లో ఏమైనా సాయం అవసరమైతే చేస్తుంటా. నేను చేస్తున్న సేవను గమనించి బయట నుంచి విరాళాలూ మొదలయ్యాయి. పేదలకు అవసరమైన నిత్యావసర వస్తువులు వగైరా అందిస్తుంటా. వీరి సమాచారం ఇచ్చేవారికి ‘నేను పంచేది హుండీలో డబ్బుతో సమానం. అవసరం అన్నవాళ్లకే వెళ్లాలి’ అని చెబుతా. వీటన్నింటినీ సరైన దారిలో వినియోగించడానికి వేదిక అవసరమని ‘నిత్యసురభి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేశా.

కరోనాతో కొత్తదారి.. సొంత డబ్బుతో 18 మందిని చదివించా. లాక్‌డౌన్‌లోనూ పేదలు, ఉపాధి కోల్పోయిన వారికి ఆహారం అందించా. ఆ సమయంలో మా వారూ కొవిడ్‌ బారిన పడ్డా సేవల్ని కొనసాగించా. నెలకు సరిపడా సరకులు స్వయంగా ప్యాకింగ్‌ చేసి పంపేదాన్ని. పదో తరగతి విద్యార్థులకు పుస్తకాలు, గ్రంథాలయాల ఏర్పాటు చేస్తున్నా. ప్రస్తుతం నెలకు సుమారు రూ. 60 వేల వరకూ ఖర్చు చేస్తున్నా. విరాళాల కన్నా సొంతంగా పెట్టేదే ఎక్కువ. కరోనా సమయంలో ఓ యువతి ఇంటికొచ్చింది. తను సినిమా థియేటర్‌లో స్వీపర్‌. పని లేక పస్తులతో నా దగ్గరకొచ్చింది. సాయం చేయగానే కాళ్లమీద పడిపోయింది. పుట్టినిల్లు కూడా లేని తనను అమ్మలా ఆదుకున్నానని ఏడుస్తూ చెప్పింది. అప్పుడొచ్చిందే ‘పుట్టినిల్లు’ ఆలోచన. నా సేవా పరిధిని మరింత విస్తరించే ఆలోచన కలిగించిందీ ఘటన.

ఒంటరి మహిళలకు ఆశ్రయమిస్తూ వారికి నచ్చిన దాంట్లో శిక్షణిప్పించి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం ఉద్దేశం. భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. సేవకు ఆటంకమని ఉద్యోగం మానేశా. పీహెచ్‌డీ కూడా పూర్తైంది. మావారి సంస్థలో సాయం చేస్తున్నా. బదులుగా ఆయన్నుంచి కొంత తీసుకుంటా. వేడుకల సమయంలో ఆయనిచ్చినవీ, అమ్మావాళ్లు బంగారం కొనుక్కోమనిచ్చిన వాటినీ ట్రస్టుకే కేటాయిస్తా. డబ్బు, వస్తువులు, అన్నదానం.. ఇవే కాదు. వృద్ధాశ్రమాలు, పేద అమ్మాయిల్లో ధైర్యం నింపుతుంటా. ఆత్మహత్యల వరకూ వెళ్లినవారిని కాపాడటం సంతృప్తినిచ్చే విషయం. మోటివేషనల్‌ క్లాసులూ తీసుకుంటుంటా. బ్లడ్‌ క్యాంప్‌లు నిర్వహించే పనిలోనూ ఉన్నా. ఇంత చదివీ.. ఇలాంటి కార్యక్రమాలెందుకు, ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయి కదా అంటుంటారు. వాళ్లతో.. నాకు ఒక్కడే బాబు. ఇంకొకరు పుడితే ఇద్దరికీ ఖర్చు చేయాలి. ఈ సేవా కార్యక్రమాలే నా రెండో బిడ్డని జవాబిస్తా. నా నుంచి సాయం పొందిన వారిని కోరేదొకటే. తీసుకున్న సాయాన్ని వాళ్లకు వీలైనట్లుగా ట్యూషన్లు చెప్పడం, ఆశ్రమాలకు వెళ్లి గడపడం.. ఇలా తోచిన విధంగా సాయపడమనే!

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.