ETV Bharat / city

ఇవాళ గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ రమేశ్​ ‌కుమార్‌

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ ఇవాళ కలవనున్నారు. హైకోర్టు సూచన మేరకు... గవర్నర్​ను కలిసి తనను ఎస్​ఈసీగా నియమించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

nimmagadda ramesh kumar will be meet the ap governor
ఇవాళ గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ రమేశ్​ ‌కుమార్‌
author img

By

Published : Jul 20, 2020, 9:55 AM IST

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు సూచన మేరకు... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను నిమ్మగడ్డ రమేశ్​‌ కుమార్ ఇవాళ కలవనున్నారు. తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని విజ్ఞప్తి చేయనున్నారు. తనను ప్రభుత్వం ఎస్ఈసీగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచాణ జరిపిన ధర్మాసనం... తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో... గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది. వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు సూచన తర్వాత నిమ్మగడ్డ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరగా... రాజ్‌భవన్ ఈ ఉదయం 11.30 గంటలకు ఖరారు చేసింది.

ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.