ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే నిమ్మగడ్డను ఏపీ ప్రభుత్వం పునర్నియమించింది. గవర్నర్ నోటిఫికేషన్ మేరకు శుక్రవారమే హైదరాబాద్లో బాధ్యతలు చేపట్టినట్లు ఎస్ఈసీ రమేష్ కుమార్ తెలిపారు. బాధ్యతల నిర్వహణకు ఇవాళ విజయవాడలోని కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈసీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ. రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. విధుల నిర్వహణలో ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా. గతంలో మాదిరిగానే ఎన్నికల సంఘానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆశిస్తున్నా.
- నిమ్మగడ్డ రమేష్, ఏపీ ఎస్ఈసీ