Night curfew in AP: ఏపీలో ఇవాళ రాత్రి నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రానున్నాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. వివాహాలు, మతపరమైన, సామాజిక పరమైన కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడంపైనా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. బహిరంగ కార్యక్రమాల్లో.. గరిష్ఠంగా 200 మంది, హాళ్లలో అయితే 100 మందికే అనుమతి ఉంటుంది. అయితే.. అంతర్‌రాష్ట్ర, రాష్ట్ర సరకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.
4,108 మందికి పాజిటివ్..
ఏపీలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 22,882 నమూనాలను పరీక్షించగా.. 4,108 కేసులు బయటపడ్డాయి. దీంతో పాజిటివిటీ రేటు 17.95%గా నమోదైంది. ఈనెల 1న పాజిటివిటీ రేటు 0.57%గా నమోదు కావడం గమనించాల్సిన అంశం.
ఇదీ చూడండి: