తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఏప్రిల్ 20 రాత్రి 9 గంటల నుంచి 30 తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పదిరోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు మినహాయింపు ఇచ్చింది. నేటితో కర్ఫ్యూ గడువు ముగియనున్నందున హైకోర్టు ఆదేశాల మేరకు మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది.
మే ఎనిమిదో తేదీ ఉదయం ఐదు గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు.
ఇవీ చూడండి: ఎన్నికలుపెట్టి ప్రజలను ఆశ్చర్యపరచవద్దు: హైకోర్టు