ఆంధ్రప్రదేశ్@లో రాత్రి పూట కర్ఫ్యూను (Night curfew extended in AP) పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీచేశారు.
కొవిడ్ నిబంధనల (covid guidelines news) మేరకు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఏపీలో కర్ఫ్యూ కొనసాగిస్తున్న సంగతి తెేలిసిందే. ఈ అక్టోబరు 31 తేదీ వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సభలు, సమావేశాలు, వివాహాల వంటి శుభకార్యాలకు గరిష్టంగా 250 మంది వరకూ అనుమతి ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలకు, కార్యక్రమాలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.
ఇదీచూడండి: Corona Vaccination Bandh: ఆ 4 రోజులు వ్యాక్సినేషన్ బంద్.. హుజూరాబాద్‌లో మాత్రం..