ETV Bharat / city

మెజిస్ట్రేట్‌లపై ఎన్‌హెచ్​ఆర్సీ బృందం ప్రశ్నల వర్షం - magistrates

దిశ నిందితుల శవ పంచనామాలు చేసిన ఎగ్జిక్యూటివ్​ మెజిస్ట్రేట్​లు ఎన్​హెచ్​ఆర్సీ బృందం ముందు హాజరయ్యారు. వారిపై ఎన్​హెచ్​ఆర్సీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. పంచనామా సమయంలో మెజిస్ట్రేట్​లు గుర్తించిన విషయాలపై ఆరా తీశారు.

NHRC team questions on magistrates about encounter
మెజిస్ట్రేట్‌లపై ఎన్‌హెచ్​ఆర్సీ బృందం ప్రశ్నల వర్షం
author img

By

Published : Dec 12, 2019, 8:34 AM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ జరిగిన ఆ ప్రాంతంలో ఏం జరిగింది..?, కాల్పులు అక్కడే జరిగాయా..?, వేరేచోట జరిగితే శవాలను అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ వేశారా..?, శవ పంచనామాలు చేసిన అధికారులను ఎన్​హెచ్​ఆర్సీ బృందం అడిగిన ప్రశ్నలివి. దిశ హత్యోదంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మహ్మద్‌ ఆరిఫ్‌, చెన్నకేశవులు, శివ, నవీన్‌ల శవ పంచనామాలు చేసిన ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌లు పాండునాయక్‌, రాములు, హైదర్‌అలీ తదితరులు ఎన్‌హెచ్​ఆర్సీ బృందం ముందు హాజరయ్యారు.
పంచనామాల సమయంలో వీరు గుర్తించిన విషయాలపై ఆరా తీశారు. పోలీసులు చెప్పినదాంట్లో ఎంతవరకు వాస్తవాలున్నాయని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలో పంచనామాలో తమ దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్నీ మెజిస్ట్రేట్‌లు వారికి వివరించారు. వేరే చోట నుంచి తెచ్చినట్లు ఏమాత్రం లేదని, అక్కడే రక్తం కూడా చిందిందని వారు చెప్పినట్లు తెలిసింది.

ఇవీ చూడండి: ఎన్​కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించిన సిట్
.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.