ETV Bharat / city

తిరుమల దర్శనాలపై ఏపీ సీఎస్‌ నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ - తిరుమల దర్శనాలు వార్తలు

తిరుమలలో ఆగమశాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా దర్శన నిబంధనలను మార్చి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించిందని వనపర్తి జిల్లా ఆత్మకూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.తిప్పారెడ్డి తెలిపారు.

nhrc asks on tirumala issue
తిరుమల దర్శనాలపై సీఎస్‌ నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ
author img

By

Published : Jul 17, 2020, 9:33 AM IST

తిరుమలలో ఆగమశాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా దర్శన నిబంధనలను మార్చి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించిందని వనపర్తి జిల్లా ఆత్మకూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.తిప్పారెడ్డి తెలిపారు. 2005లో అప్పటి తితిదే పాలకమండలి... లఘుదర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్‌ దర్శనాల విధానాన్ని ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా అమలుపర్చడం ప్రారంభించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

ఇది దేవాదాయశాఖ చట్టం 142 ప్రకారం సమ్మతం కాదని ఈ నెల 3న ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశానన్నారు. ఫిర్యాదును 14వ తేదీన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ విచారణకు స్వీకరించారన్నారు. తిరుమల దర్శన విధానాల్లో మార్పులపై ప్రభుత్వ వైఖరి, తీసుకోనున్న చర్యలపై 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఈ నెల 16న‌ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారని తిప్పారెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్‌ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్‌..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.