ETV Bharat / city

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ఎన్జీటీలో విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లను జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రధాన ధర్మాసనం సోమవారం విచారించనుంది. పర్యావరణ అనుమతలు సరిగా లేవని గతంలో దాఖలైన పిటిషన్​కు.. కాళేశ్వరం విస్తరణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్​ను కలిపి జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ఎన్జీటీలో విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ఎన్జీటీలో విచారణ
author img

By

Published : Oct 12, 2020, 5:47 AM IST

కాళేశ్వర ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు సరిగా లేవంటూ 2018లో హాయతూద్దీన్ జాతీయ హరిత ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం డిజైన్ మార్చి చేపట్టిందని.. మార్పులు చేసిన తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. దాదాపు రెండేళ్లుగా ఈ పిటిషన్​పై విచారణ కొనసాగుతూ వస్తోంది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులను సవాలు చేస్తూ ఎన్జీటీ చెన్నై బెంచ్​లో వేములఘాటు రైతులు పిటిషన్ దాఖలు చేశారు.

పర్యావరణ అనుమతులు లేకుండా రూ.21 వేల కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారని.. అనుమతులు పొందే వరకు పనులు నిలిపివేయాలని రైతులు కోరారు. ఇప్పటికే ఎన్జీటీ ప్రధాన ధర్మాసనంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సంబంధిత పిటిషన్ ఉన్నందున.. దీన్ని కూడా అక్కడికే బదిలీ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ వినతిని ధర్మాసనం అంగీకరించింది. సోమవారం ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం రెండు పిటిషన్లపై సమగ్ర వాదనలు విననుంది.

ఇవీ చూడండి: కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జీటీలో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.