మత్స్యకారుల కోసం ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పేరుతో ప్రత్యేక బీమా(insurance to Fishermen) పథకం అమలు చేస్తున్నట్లు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (NFDB) సీఈవో సువర్ణ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఎఫ్‌డీబీ ప్రధాన కార్యాలయంలో బీమా పత్రాలను ఆమె సోమవారం విడుదల చేశారు. ఈ పథకంలో నమోదైన మత్స్యకారులు.. ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు, శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.2.50 లక్షలు, ఆసుపత్రిలో చేరితే రూ.25 వేల తక్షణ సహాయం అందుతుందన్నారు.
ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం వాటా చెల్లిస్తే, కేంద్రం 60 శాతం భరిస్తుందన్నారు. తెలంగాణ సహా 7 రాష్ట్రాలు ఈ పథకం అమలుకు ముందుకు వచ్చాయని.. వాటిల్లోని 16 లక్షల మంది మత్స్యకారులు పథకంలో చేరారని వివరించారు.
ఇదీ చదవండి: GURUKUL DEGREE COLLEGES: కొత్తగా 20 డిగ్రీ గురుకుల కళాశాలలు!