ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

top news
top news
author img

By

Published : Oct 14, 2021, 6:07 AM IST

Updated : Oct 14, 2021, 10:10 PM IST

22:01 October 14

టాప్​న్యూస్​ @ 10PM

  • మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) అనారోగ్యంతో (top maoist rk dead) కన్నుమూశారు. ఆర్కే ప్రస్తుతం (Akkiraju Haragopal is no more)మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దక్షిణ బస్తర్‌ అడవుల్లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధ్రువీకరించలేదు. నాలుగు దశాబ్దాలుగా ఆర్కే మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

  • పూల జాతరతో ఉయ్యాలో.. 

తీరొక్క పూలను ఉయ్యాలో తీరుగా పేర్చిండ్రు ఉయ్యాలో.. పూలవనమంతా ఉయ్యాలో బతుకమ్మలో చేరి పరవశించే ఉయ్యాలో.. సద్దుల బతుకమ్మ ఉయ్యాలో సంబురమే ఊరంతా ఉయ్యాలో.. పట్టుచీరలు ఉయ్యాలో పెయినిండా నగలు ఉయ్యాలో.. గాజుల చప్పట్లు ఉయ్యాలో గజ్జెల చిందులు ఉయ్యాలో.. ఊరుఊరంతా ఉయ్యాలో ఊరేగివచ్చింది ఉయ్యాలో..

  • 'మరోసారి మెరుపుదాడులు తప్పవు

సరిహద్దుల వద్ద ఆటంకాలు సృష్టిస్తే మళ్లీ మెరుపుదాడులు తప్పవని పాకిస్థాన్​కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah News). సరిహద్దుల వద్ద సమస్య అనే ప్రశ్న తలెత్తితే అందుకు అనుగుణంగానే జవాబిస్తామని స్పష్టంచేశారు.

  • యువ డైరెక్టర్​తో పవన్​ సినిమా

పవర్​స్టార్ మరో యంగ్​ డైరెక్టర్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు! ప్రస్తుతం అతడు కథ వినిపించారు. అయితే అంగీకరించారా లేదా అనేది త్వరలో స్పష్టత రానుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే?

  • 'ఇంగ్లాండ్​తో మ్యాచ్​ అంటే భయపడాల్సిందే!'

ఇంగ్లాండ్​తో మ్యాచ్​ అంటే భయపడే పరిస్థితి రాబోతుందని ఆ జట్టు బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ జోస్యం చెప్పాడు. రాబోయే రోజుల్లో తమ జట్టుతో మ్యాచ్​ అంటే మిగిలిన టీమ్స్​కు నిద్ర కూడా పట్టదని అభిప్రాయపడ్డాడు.

20:47 October 14

టాప్​న్యూస్​ @ 9PM

మావోయిస్టు అగ్రనేత కన్నుమూత..

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దక్షిణ బస్తర్‌ అడవుల్లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధ్రువీకరించలేదు. నాలుగు దశాబ్దాలుగా ఆర్కే మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

ఫుల్​ ట్రాఫిక్​ జామ్​..

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్‌ నుంచి నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు గంట సమయం పట్టింది.

పాక్​కు షా వార్నింగ్​..

సీబీఎస్​ఈ కీలక ప్రకటన..

నవంబర్​- డిసెంబర్​లో ఆఫ్​లైన్​ విధానంలో(cbse news today) 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ పరీక్షలు జరుగుతాయని సీబీఎస్​ఈ గురువారం ప్రకటించింది(cbse news today class 10). ఇందుకు సంబంధించిన డేట్​ షీట్​ను 18న విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.

రాంచరణ్​ కొత్త సినిమా...

మెగాపవర్​స్టార్ రామ్​చరణ్(ram charan next movie) కొత్త సినిమా ప్రకటన.. శుక్రవారం ఉదయం రానుందట! ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతోంది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి డైరెక్టర్​ అని టాక్ నడుస్తోంది.

20:02 October 14

టాప్​న్యూస్​ @ 8PM

  • మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత 

మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత మూశారు. అనారోగ్యంతో దక్షిణ బస్తర్‌ అడవుల్లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్లు సమాచారం

  • ' ఇండస్ట్రీకి తండ్రులు'

ఏపీ థియేటర్లలో 100 శాతం ప్రేక్షకుల్ని అనుమతించడంపై నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సినీ పరిశ్రమకు తండ్రుల్లాంటివారని అన్నారు.

టీమ్ఇండియా కోచ్​గా ద్రవిడ్​!

న్యూజిలాండ్​ పర్యటనలో టీమ్ఇండియా ప్రధానకోచ్​గా రాహుల్​ ద్రవిడ్​ను బీసీసీఐ ఎంపిక చేయనుందని సమాచారం. టీ20 ప్రపంచకప్​ తర్వాత ప్రస్తుత కోచ్​ రవిశాస్త్రి ఆ పదవి నుంచి తప్పుకోవడం వల్ల అందుకోసం ద్రవిడ్​ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

  • రామ్​చరణ్ కొత్త చిత్రం

సినీ అప్డేట్స్(cinema news) వచ్చేశాయి. ఇందులో రామ్​చరణ్ కొత్త చిత్రం, శ్యామ్​సింగరాయ్, అన్నాత్తె, బేబీ సినిమాల సంగతులు ఉన్నాయి.

  • భారీగా పెరిగిన ఎగుమతులు

సెప్టెంబర్​ నెలలో దేశీయ ఎగుమతులు (India Exports And Imports) గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. 22.63 శాతం పెరిగి సుమారు 34 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

19:04 October 14

టాప్​న్యూస్​ @ 7PM

  • తెలుగు అకాడమీ స్కాంలో మరొకరు అరెస్ట్​

తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన సాంబశివరావును అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. హైదరాబాద్​కు తీసుకొచ్చి రిమాండ్​కు తరలించారు. 

  • అందుకు తెలంగాణ సిద్ధం..

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మినహా మిగతా ఔట్ లెట్లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. కేఆర్ఎంబీ సమావేశం మినిట్స్ నేపథ్యంలో బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయమై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్​కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.

  • ఎల్​ఈడీ బల్బు​లో సిమ్​కార్డ్.. 

ప్రభుత్వం పంచిన ఎల్​ఈడీ బల్బు తెచ్చుకున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అది సరిగా పనిచేయట్లేదని దానిని తెరచి చూసిన వ్యక్తి అందులో సిమ్​కార్డ్ అమర్చి ఉండటం వల్ల ఆశ్చర్యపోయాడు. ఒక ఫోన్​లో ఉన్నట్లుగానే బల్బులో సిమ్​ స్లాట్​ ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

  • 20 వరకు జైల్లోనే..

ఆర్యన్‌ ఖాన్‌కు (Aryan Khan Bail) మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్​పై తీర్పును రిజర్వ్​ చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్యన్​ 20వ తేదీ వరకు జైల్లోనే ఉండాల్సి ఉంది.

  • రాజమౌళితో సినిమాపై మహేశ్​ క్లారిటీ

స్టార్ దర్శకుడు రాజమౌళితో సినిమాపై మహేశ్​(mahesh babu new movie) స్పష్టతనిచ్చారు. అన్ని భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుందని, దీనితోనే బాలీవుడ్​లోకి అరంగేట్రం చేయనున్నానని అన్నారు. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో ఈ సినిమా మొదలుకావొచ్చు.

17:43 October 14

టాప్​న్యూస్​ @ 6PM

  • దసరా సందడి షురూ.. 

దసరా పర్వదినం వేళ మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని మార్కెట్లకు జనం పోటెత్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత దసరా, బతుకమ్మ పండుగలు ప్రజల్లో సంతోషం నింపాయి. హైదరాబాద్ జంటనగరాల్లో పూల మార్కెట్లు రద్దీగా మారాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు, ఇంటి అలంకరణ కోసం ఉపయోగించే పూలు, పూజా సామగ్రి ధరలు పెరిగిపోయాయి. అసలే కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడు బయటపడుతున్న తరుణంలో బంతి, చేమంతి, గులాబీ, మల్లె... ఇలా ఏ పూలు తీసుకున్నా ధరలు ఎక్కువగా ఉండటం రైతులకు కలిసొచ్చింది. 

  • ఆలయాలపై దాడులు 

హిందూ దేవాలయాలపై (Bangladesh Temple Attack) దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్​లో పెద్ద ఎత్తున అలర్లు చెలరేగాయి. దీంతో 22 జిల్లాల్లో సరిహద్దు దళాలు, పారా మిలటరీ బలగాలను మోహరించింది ప్రభుత్వం.

  • ఈ పాలు తాగితే వద్దన్నా.. 

నిద్ర ఎక్కువై కొందరికి సమస్యలొస్తుంటాయి. మరికొందరికి (indian home remedy for sleep) నిద్రలేమి వేధిస్తుంది. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా పెద్ద సమస్యే. గాఢంగా నిద్రపట్టడానికి దీనిని పాలలో కలుపుకొని తాగాల్సిందే మరి! ఇంతకీ అదెంటంటే?

  • బాలయ్య 'అన్​స్టాపబుల్'.. దీపావళి నుంచే

అగ్రకథానాయకుడు బాలకృష్ణ(Balakrishna talk show).. తొలిసారి ఓటీటీలో చేస్తున్న టాక్​ షో కర్టెన్​ రైజర్​ను గురువారం లాంఛనంగా ఆవిష్కరించారు. దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి ఈ షో ప్రసారం కానుంది.

  • ట్రోఫీ నెగ్గేదెవరు?

ఐపీఎల్‌-14వ సీజన్(IPL 2021 Final) ట్రోఫీ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌(CSK Vs KKR) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశల్లో అద్భుత ఆటతీరుతో ఫైనల్‌ చేరిన ఇరుజట్లు.. కీలక మ్యాచ్​కు సిద్ధమయ్యాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై(Chennai Super Kings IPL Wins).. రెండు సార్లు కప్పు ముద్దాడిన కోల్​కతా(Kolkata Knight Riders IPL Wins) జట్లు మరో టైటిల్‌ను తమఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాయి. ఇరుజట్ల మధ్య తుదిపోరు శుక్రవారం రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది.

16:53 October 14

టాప్​న్యూస్​ @ 5PM

  • హుజూరాబాద్​ నేతలు సెల్​ఫోన్​లో మాట్లాడరు!

హుజూరాబాద్​లో వింత పరిస్థితి నెలకొంది. నిత్యం ఫోన్లలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు ప్రస్తుతం ఫోన్ అంటేనే (Huzurabad Cellphone Fear) హడలెత్తిపోతున్నారు. చరవాణిలో మాట్లాడాలంటే జంకుతున్నారు. ఎంత ముఖ్యమైన విషయమైన సరే ముఖాముఖిగా మాట్లాడుకోవడమే మేలంటున్నారు. హుజూరాబాద్​లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సెల్​ఫోన్లకు దూరంగా ఉన్నారు. ఆ అంశంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

  • రెండు తలలు, మూడు కళ్లతో..

ఓ ఆవు.. రెండు తలలు(Two-Headed Calf), మూడు కళ్లు, రెండు నాలుకతో ఉన్న దూడకు జన్మనిచ్చింది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివస్తున్నారు. నవరాత్రి పర్వదినాల మధ్యలో ఈ లేగదూడ పుట్టడం వల్ల అక్కడి ప్రజల పూజలు చేస్తున్నారు.

  • ఉద్యోగి మనసు విరిగింది..!

కొవిడ్‌ నేర్పిన పాఠంతో ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున కొలువులు వీడుతున్నారు ఉద్యోగులు. ఏళ్ల తరబడి నమ్మకంగా పనిచేసినా, మహమ్మారి కష్టకాలంలో యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వారి మనసును గాయపర్చింది. దీంతో కరోనా వ్యాప్తి తగ్గి, కంపెనీలు ఆకర్షణీయ వేతనాలు ఇస్తామన్నా.. కొత్త మార్గాన్ని వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ కారణంగా అగ్రదేశాల్లో 'ది గ్రేట్ రెజిగ్నేషన్' (The Great Resignation 2021) సునామీ మొదలైంది.

  • 'మహాసముద్రం' మెప్పించిందా?

ప్రేమ, యాక్షన్ మిక్స్ చేసిన తీసి 'మహాసముద్రం' సినిమా(mahasamudram review).. థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? అంచనాల్ని అందుకుందా? ప్రేక్షకుల్ని మెప్పించిందా తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

  • పాక్​ క్రికెటర్​ సస్పెండ్​

టీ20 ప్రపంచకప్​కు ముందు ఓ పాకిస్థాన్​ క్రికెటర్​ సస్పెండ్​కు గురయ్యాడు. అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిపై విచారణకు పీసీబీ ఆదేశించింది. పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ పూర్తయ్యే వరకు సదరు ఆటగాడు ఎలాంటి క్రీడాకార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలులేదు.

15:55 October 14

టాప్​న్యూస్​ @ 4PM

  • 'తెలంగాణలో విద్యుత్ సంక్షోభం లేదు'

రాష్ట్రంలో 2 వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని... విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. అదనంగా ఉన్న బొగ్గును ఇతర రాష్ట్రాలకు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లను బిగిస్తామనే ప్రచారంలో ఎటువంటి నిజంలేదని... మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం కచ్చితంగా మీటర్లు బిగించాలని ఒత్తిడి తెస్తే... అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామంటున్న మంత్రి జగదీశ్‌రెడ్డితో ఈటీవీ ముఖాముఖి.

  • 'మోహన్​బాబు, నరేశ్​ బెదిరించారు'

'మా' ఎలక్షన్ రోజు మోహన్​బాబు, నరేశ్​.. బెదిరించడమే కాకుండా కొందరిపై చేయిచేసుకున్నారని ప్రకాశ్​రాజ్(prakash raj panel) వెల్లడించారు. ఎన్నికల అధికారికి రాసిన లేఖలో ఈ విషయాల్ని పేర్కొన్నారు.

  • రైతులకు శుభవార్త.. 

మొలాసిస్‌ నుంచి ఉత్పత్తి అయ్యే పొటాష్‌పై (Potash Subsidy) తొలిసారిగా సబ్సిడీని అందించాలని కేంద్రం నిర్ణయించింది. 50 కేజీల బస్తాపై రూ.73 సబ్సిడీని నిర్ణయించింది.

  • ఐపీఎల్​ నియమావళిని ఉల్లంఘించిన దినేశ్​ కార్తిక్​

కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాట్స్​మన్​ దినేశ్ కార్తిక్​ను(Dinesh Karthik News) ఐపీఎల్​ నిర్వాహకులు మందలించారు. దిల్లీ క్యాపిటల్స్​తో(DC Vs KKR) జరిగిన క్వాలిఫయర్స్​-2 మ్యాచ్​లో ఐపీఎల్​ నియమావళిని దినేశ్​ కార్తిక్​ ఉల్లంఘించడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 'ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌'(IPL Code of Conduct) కింద తప్పు చేసినట్లు దినేశ్​ కార్తిక్​ అంగీకరించాడని నిర్వహకులు తెలిపారు.

  • 61వేల మార్కును దాటిన సెన్సెక్స్

 స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ (Sensex Today) 569 పాయింట్లు పెరిగి 61,300 వేల పైకి చేరింది. నిఫ్టీ (Nifty Today) 176 పాయింట్ల లాభంతో 18,339 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీలు రెండూ జీవనకాల గరిష్ఠాలను తాకాయి.

14:46 October 14

టాప్​న్యూస్​ @ 3PM

  • చెరువులో తల్లీకూతురు గల్లంతు

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనగుర్తి చెరువులో తల్లి, కుమార్తె గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిన కుమార్తెను రక్షించేందుకు వెళ్లిన తల్లీ గల్లంతైంది. 

  •  ట్రాన్స్​ఫార్మర్​కు మద్యంతో అభిషేకం

విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు చేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్​ వింతగా ప్రవర్తించాడు. ట్రాన్స్​ఫార్మర్​కు అగరబత్తీలు వెలిగించి, లడ్డూలు, పువ్వులతో పూజలు చేశాడు. అంతేగాక.. ట్రాన్స్​ఫార్మర్​పైకి ఎక్కి, దానిపై మద్యం పోశాడు. 

  • 'మా' గొడవలోకి శ్రీరెడ్డి.. 

మెగాబ్రదర్స్​ చిరంజీవి, నాగబాబు, పవన్​కల్యాణ్​పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి. 'మా' ఎన్నికల్లో ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ సభ్యులు రాజీనామా చేయడం వెనుక వారి హస్తం ఉందని ఆరోపించింది.

  • 'ఫినిషర్​గా హార్దిక్..'

టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2021) త్వరలోనే ప్రారంభంకానున్న వేళ.. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya News) బౌలింగ్​ ఫామ్​పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాండ్యను.. ఎంఎస్ ధోనీ మాదిరిగా ఫినిషర్​గా పంపాలని జట్టు భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.

  • దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) తగ్గింది. సెప్టెంబర్​లో టోకు ద్రవ్యోల్బణం 10.66 శాతంగా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

13:49 October 14

టాప్​న్యూస్​ @ 2PM

  • గుర్తుండిపోయేలా నిర్వహిస్తాం...

హైదరాబాద్​లోని హైటెక్స్​లో ఈ నెల 25న తెరాస ప్లీనరీ జరగనుంది. హైటెక్స్​లో ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్​ విజయలక్ష్మితో కలిసి మంత్రి కేటీఆర్​ పరిశీలించారు. ప్లీనరీ సమావేశం కోసం ప్రజాప్రతినిధులకు పాసులు మంజూరు చేస్తామని.. పాసులు ఉన్నవారినే అనుమతిస్తారని కేటీఆర్​ వెల్లడించారు.

  • ఆ ఎంపీ ఇంటికి రేవంత్​రెడ్డి.. అందుకేనా?

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్​ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు(Revanth Reddy meets D.Srinivas). హైదరాబాద్ బంజారాహిల్స్​లోని ఆయన ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. రేవంత్​ను సాదరంగా ఆహ్వానించిన శ్రీనివాస్​.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు.

ప్రోటోకాల్ రచ్చ..

అమీర్‌పేటలో నూతన ప్రభుత్వాస్పత్రి (New Government House at Ameerpet)ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి( Kishan Reddy), మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yadav) ప్రారంభించారు.  ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు ముందు వరుసలో లేదని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెరాస కార్యకర్తలు వారికి పోటీగా నినాదాలు చేశారు. పరస్పర నినాదాలతో ఉద్రిక్తత ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను అక్కడ నుంచి పంపించివేశారు. సభావేదిక ఏర్పాటు చేసినా కిషన్‌రెడ్డి, తలసాని మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

  • సాంబార్​ రుచిగా లేదని.. తల్లి, సోదరి హత్య

మద్యం మత్తులో కన్నతల్లితో పాటు తోబుట్టువుపై దారుణానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. సాంబార్ సరిగా చేయలేదన్న చిన్న కారణంతో.. వారిపై కాల్పులు జరిపి, ప్రాణాలు తీశాడు.

  • స్టార్ హీరోయిన్​కు ఈడీ చిక్కులు

ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ నటులే లక్ష్యంగా కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు చెన్నైకి చెందిన సుకేశ్​ చంద్రశేఖర్. ఈ​ కేసు విచారణలో భాగంగా నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి(nora fatehi news today) గురువారం ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు.

12:55 October 14

టాప్​న్యూస్​ @ 1PM

  • బాలయ్యను కలిసిన మోహన్​బాబు, విష్ణు

'మా' ఎన్నికల్లో అధ్యక్షునిగా గెలిచిన తన తనయుడు విష్ణుతో కలిసి హీరో బాలకృష్ణను కలిశారు నటుడు మోహన్​బాబు. బాలయ్య ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లినట్లు తెలిపారు.

  • ఆ ఆర్టీసీ బస్సులే లారీలిక!

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ వల్ల నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర రవాణా శాఖ(Telangana Transport Ministry) అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రవేశపెట్టిన కార్గో, పార్శిల్(TSRTC CARGO SERVICES) సేవలు కొంతమేరకు ఆదాయన్ని సమకూరుస్తున్నాయి. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు టీఎస్​ఆర్టీసీ మరో కొత్త అడుగు వేసింది. కార్గో సేవల(TSRTC CARGO SERVICES) కోసం కొన్ని బస్సులను లారీగా మార్చి అందుబాటులోకి తీసుకువచ్చింది.

  • తుపాను బీభత్సం-19మంది మృతి

ఫిలిప్పీన్స్​ను తుపాను వణికిస్తోంది. తుపాను సృష్టించిన బీభత్సానికి ఇప్పటివరకు 19మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

  • దుర్గా మండపంలో కాల్పులు

దుర్గా మండపంలో రక్తపాతం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు బాలికలకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ అయోధ్యలో(Uttar Pradesh Ayodhya News) జరిగింది.

  •  వయ్యారాలు చూడాల్సిందే!

'దూకుడు'​, 'బాద్​షా', 'మహర్షి' సహా పలు చిత్రాల్లో నటించిన మీనాక్షి దీక్షిత్​.. సోషల్​మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్​ను బాగా పెంచుకుంటుంది. తన ఫొటోలను పోస్ట్​ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇవాళ(అక్టోబర్​ 14) ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

11:54 October 14

టాప్​న్యూస్​ @ 12 NOON

  • ప్రాణం తీసిన కోడిగుడ్డు

పండ్ల గింజలు, నాణేలు పిల్లల గొంతులో ఇరుక్కోవడం గురించి మనం చాలా సార్లు వింటుంటాం. కొన్నిసార్లు అవి బయటకు పోయి ప్రాణాలు దక్కుతాయి. మరికొన్నిసార్లు ఊపిరాడక కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ.. కోడిగుడ్డు గొంతు(Egg stuck in Throat)లో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలోని నేరళ్లపల్లిలో చోటుచేసుకుంది.

  • ప్రాణాలు తీసిన పరోటా

పరోటా తిని.. తల్లి, కూతురు మరణించారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

  • 'సైలెంట్​ పాలిటిక్స్'​

అధికారిక ప్రకటన చేయకుండానే... స్టార్​ హీరో విజయ్​ 'రాజకీయాలు' మొదలుపెట్టారా? పార్టీ స్థాపించకుండానే.. అభిమాన సంఘం ద్వారానే 'అన్నీ' నడిపిస్తున్నారా? ఔననే అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు. ఇటీవల జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ ఫ్యాన్స్​ అసోసియేషన్​ సభ్యులు 100 మందికిపైగా గెలవడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నాయి. అతి త్వరలో జరిగే మరో 'కీలక పోరు'కు విజయ్​ సేన సిద్ధమవుతున్నట్లు విశ్లేషిస్తున్నాయి.

  • మేం గెలవడం పక్కా

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) టీమ్‌ఇండియాపై తమ జట్టు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(Babar Azam News). తాము ఆడబోయే తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే.. తమ టీమ్​ మరింత బలోపేతమవుతుందని అన్నాడు.

  • 'భీమ్లానాయక్​' సాంగ్​ ప్రోమో.. '

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'భీమ్లానాయక్'​, 'మంచి రోజులు వచ్చాయి', 'తగ్గేదే లే' చిత్ర సంగతులు ఉన్నాయి.

10:54 October 14

టాప్​న్యూస్​ @ 11AM

  • మహిళపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్​లోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది.  మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పుస్తెలతాడు, నగదు ఎత్తుకెళ్లినట్లు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల అధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. 

  • ప్రోత్సహిస్తే.. ఏదైనా సాధిస్తాం..

పెళ్లైతే చదువుకి దూరం కావాలా? అమ్మాయిలు టీచర్లు, డాక్టర్లు వంటి వృత్తులనే ఎందుకు ఎన్నుకోవాలి? భిన్నమైన రంగాలని ఎంచుకునేలా వారిని ప్రోత్సహించాలి. కెరియర్‌లో నిలదొక్కుకునేందుకు కుటుంబం ప్రోత్సాహం ఇవ్వాలి అంటోన్న వీరంతా తాజాగా తెలంగాణా హైకోర్టుకి న్యాయమూర్తులుగా ఎంపికయ్యారు. వారి ప్రస్థానాన్ని, మనోభావాలను ఈటీవీభారత్​తో పంచుకున్నారిలా...

  • అధ్యయనానికి ఉపసంఘం

కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు సహా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ విషయమై అధ్యయనం కోసం రాష్ట్ర సర్కార్ ఉపసంఘాన్ని(Sub Committee for Projects Management) ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాధాన్యాలు, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోర్డుకు తగిన సిఫారసు చేయాలని ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

  • నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం

జ్వరం, నీరసం కారణంగా దిల్లీ ఎయిమ్స్​లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్మోహన్​ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ పరామర్శించారు.

  • మెరిసిన బుర్జ్​ ఖలీఫా

టీమ్​ఇండియా కొత్త జెర్సీని(Team India Jersey) ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్​ ఖలీఫాపై(team india jersey on burj khalifa) ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

09:48 October 14

టాప్​న్యూస్​ @ 10AM

  • తెలంగాణ తలసరి ఆదాయమెంతో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధిపై కొవిడ్ ప్రభావం గణనీయంగా పడినప్పటికీ తెలంగాణ మాత్రం కొవిడ్​ కష్టకాలంలోనూ సానుకూల దిశగానే పయనించిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది (state economy). ఈ మేరకు ప్రణాళిక, అర్థగణాంక శాఖలు బుక్​లెట్లను రూపొందించాయి.

  • రంగంలోకి సీఎం కేసీఆర్...

బియ్యం సేకరణకు ఎట్టకేలకు కేంద్రం గడువు పొడిగించింది. దీంతో సుమారు నెల రోజులుగా సాగుతున్న తంతుకు తెరపడింది. వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి మిల్లర్ల వద్ద ఉన్న బియ్యం తీసుకునేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ నెలన్నరకుపైగా గడువు ఇచ్చింది.

  • ఉత్తర్వులపై ఉత్కంఠ!

కృష్ణా, గోదావరి నదులపై గుర్తించిన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్(KRMB and GRMB Gazette Implementation) నోటిఫికేషన్ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయంపై ఇప్పటికే రెండు బోర్డులు ఇరు రాష్ట్రాల అధికారులతో పలుమార్లు సమావేశమయ్యాయి. మొత్తం 15 అవుట్​లెట్లకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. కేఆర్​ఎంబీ ప్రకటించిన 15 అవుట్​లెట్లలో శ్రీశైలం పరిధిలో 6.. సాగర్​ కింద 9 అవుట్​లెట్లు ఉన్నాయి. విద్యుత్ కేంద్రాలు మినహాయించి ఉత్తర్వులిచ్చేందుకు తెలంగాణ యత్నిస్తుండగా.. ఉత్తర్వుల జారీపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.

  • వైన్​తో నడిచే కారు..

మద్యం తాగి కారును నడపడం నేరం.. కానీ కారే మద్యం సేవించి రోడ్లపై(Car Runs On Wine) పరుగులు తీస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నూటికి నూరుశాతం నిజం. స్వయానా ఓ దేశ యువరాజు తన కారు మద్యంతో నడుస్తోందని ప్రకటించారు. రాజసౌధంలో మిగిలిపోయిన వైన్‌ను పోసి ఆస్టోన్ మార్టిన్ కారులో యువరాజు చక్కర్లు కొడుతున్నారు.

  • సెన్సెక్స్ 300 ప్లస్

స్టాక్​ మార్కెట్లు(stock market) వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 334 పాయింట్లు వృద్ధి చెంది జీవనకాల గరిష్ఠాన్ని చేరింది. ప్రస్తుతం 61,068 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ సైతం లాభాలతోనే ట్రేడింగ్ ఆరంభించింది. 111 పాయింట్లు ఎగబాకి.. 18,273 వద్ద కొనసాగుతోంది.

08:49 October 14

టాప్​న్యూస్​ @ 9AM

  • రూ.80 లక్షల నోట్ల కట్టలు కాల్చేశా...

తెలుగు అకాడమీ ఫిక్స్​డ్ డిపాజిట్ల(Telugu Akademi FD Scam Updates) పేరిట కోట్ల రూపాయలు కాజేసిన నిందితులు.. దర్యాప్తులో చెప్పే విషయాలు విని అధికారులు నివ్వెరపోతున్నారు. నమ్మశక్యంకాని విషయాలు చెబుతూ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. భయంతో రూ.80 లక్షల నోట్ల కట్టలు కాల్చేశానని ఒకరు చెబుతుంటే.. 5 ఏళ్ల క్రితం చేసిన అప్పు కట్టానని మరొకరు అంటున్నారు. మిగిలిన నిందితులూ ఇలాంటి కట్టుకథలే చెబుతున్నట్లు తెలుస్తోంది.

  • ఆగని పెట్రో బాదుడు

దేశంలో పెట్రో​ ధరల (Fuel Price Today) బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు గురువారం చమురు సంస్థలు తెలిపాయి.

  • అక్కడ రూ.5కే భోజనం..

రోగుల వెంట సహాయకులుగా ఆస్పత్రులకు వెళ్లే వారు.. ఆహారం, వసతి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు స్థోమత లేక.. సర్కార్ దవాఖానాలకు వెళ్లేది పేదలే. మరి వారితో సహాయకులుగా వెళ్లిన వారు భోజనానికి, ఉండటానికి వసతిలేక.. వాటిని కొనుక్కునే స్థోమత లేక అవస్థలు పడుతున్నారు. వారి సమస్యను గుర్తించిన తెలంగాణ సర్కార్ ఓ బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. సర్కార్ దవాఖానా(Telangana Government Hospitals)ల్లో రోగులకు సహాయకులుగా వచ్చే వారి కోసం రూ.5లకే భోజనం, ఉండటానికి వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

  • అధిక సంతానం ఉన్నవారికి ప్రైజ్​మనీ

తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్నవారికి మిజోరం(Mizoram Population) క్రీడా శాఖ మంత్రి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 17 మంది తల్లిదండ్రులకు దాదాపు రూ.2.5 లక్షల నగదుతో పాటు , ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు.

  • కొత్త సినిమాలపై క్లారిటీ

పెళ్లయ్యాక భార్యభర్తలు ఎలా ఉండాలనే విషయాన్ని ప్రధాన అంశంగా తీసుకుని 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' (most eligible bachelor movie release date) సినిమా తెరకెక్కించినట్లు తెలిపారు చిత్రనిర్మాత బన్నీవాసు(most eligible bachelor producer). అయితే ఈ విషయాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఈ మూవీ అక్టోబర్​ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రవిశేషాలు సహా హీరో అల్లుఅర్జున్​ గురించి మాట్లాడారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

07:47 October 14

టాప్​న్యూస్​ @ 8AM

  • అబార్షన్​కు ఓకే!

కొన్నివర్గాల మహిళలకు గర్భాన్ని తొలగించే గరిష్ఠ పరిమితి గడువును 20 నుంచి 24 వారాలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అబార్షన్‌ సవరణ చట్టం 2021 ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళలు అబార్షన్‌కు అర్హులని పేర్కొంది.

  • సింగరేణికి కేంద్రం షాక్..

బొగ్గు బ్లాకుల(coal blocks)ను వేలం వేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ(Ministry of Coal) సింగరేణికి షాక్‌ ఇచ్చింది. నాలుగేళ్లుగా తమ ఏరియాల్లోని పలు బ్లాకులను కేటాయించాలని సింగరేణి(Singareni Collieries) చేస్తున్న విజ్ఞప్తులను తోసిరాజని వేలంలో చేర్చింది. దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటన జారీ చేసింది.

  • తిరిగిరారు తనవాళ్లు.. తలచుకుంటే కన్నీళ్లు

ఒకరా..ఇద్దరా ఏకంగా ఎనిమిది మంది కుటుంబ సభ్యుల్ని ఓ కాళరాత్రి కమ్మేసింది. ఆ కుటుంబ పెద్దకు కడుపు కోత మిగిల్చింది. ఇప్పటికీ దొరకని మృతదేహాల కోసం ఆ హృదయం తల్లడిల్లుతూనే ఉంది. వరదలో కొట్టుకుపోతూ మృత్యుంజయుడిగా నిలిచిన ఆయన.. ‘నన్నెందుకు బతికించావు భగవంతుడా’ అంటూ రేయింబవళ్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని అలీనగర్‌ ప్యాలెస్‌వ్యూ కాలనీకి చెందిన మహమ్మద్‌ తాహేర్‌ ఖురేషీ(62) కుటుంబంలో గత ఏడాది అక్టోబరు 14న జరిగిన విషాదమిది. అప్పట్లో మహానగరాన్ని కుదిపేసిన వరద తాలూకూ విలయంలో ఇద్దరు కుమారులు, ముగ్గురు కోడళ్లు, మనవడు, మనవరాలు, సోదరుడిని కళ్లముందే కోల్పోయానంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

  • తొలి ఆటగాడిగా రొనాల్డో

అంతర్జాతీయ ఫుట్​బాల్​ చరిత్రలో మరో రికార్డు సృష్టించాడు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Ronaldo hat trick total). పది హ్యాట్రిక్​లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

  • ఆమె బయోపిక్​లో నటించాలని ఉంది

పారా ఒలింపిక్స్​లో విజయం సాధించిన అరుణిమా సిన్హా(arunima sinha mount everest) బయోపిక్​లో నటించాలని ఉందని తెలిపింది హీరోయిన్​ జాన్వీ కపూర్(janvikapoor latest movies)​. ఆమె కథ ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పింది.

06:53 October 14

టాప్​న్యూస్​ @ 7AM

  • తస్మాత్ జాగ్రత్త...

కరోనా కాస్త నెమ్మదించడంతో.. అది మనల్ని వీడిపోయిందని అపోహ పడుతున్న కొందరు ఆ లక్షణాలు(corona symptoms) కనిపిస్తున్నా పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైరల్‌ జ్వరమనే భ్రమలో ఉండిపోతున్నారు. జ్వరం, జలుబే కదా ఏమవుతుందనే భావన ఒక్కోసారి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయి చివరికి ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

  • మండిపోతున్న విద్యుత్‌ అమ్మకపు ధరలు

దేశచరిత్రలో ఎన్నడూ లేనిస్థాయిలో విద్యుత్‌ అమ్మకపు ధరలు మండిపోతున్నాయి (energy crises deeps in India). ఇతర రాష్ట్రాలు గరిష్ఠంగా రూ.20కి యూనిట్‌ చొప్పున కొంటుండగా.. తెలంగాణలో మిగులు విద్యుత్‌ ఉండటంతో రోజుకు 2 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) దాకా ఐఈఎక్స్‌లో రాష్ట్రం విక్రయిస్తోంది. బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి సరఫరాలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలు ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుకు పోటీ పడుతుండటంతో ధర పెరుగుతోంది.

  • హెచ్చరిల్లుతున్న పేదరికం

కరోనా కారణంగా దక్షిణాసియా, సహారా ఎడారి దిగువ దేశాల్లో పేదరికం మరింత పెరిగిందని ప్రపంచ బ్యాంక్​ పేర్కొంది. భారత్‌లో కొవిడ్‌కు ముందే ఎక్కువగా ఉన్న పేదరికం వైరస్‌ కాలంలో తీవ్రమైందని.. ఈ నేపథ్యంలో పేదరికాన్ని తగ్గించి, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి సాధనకు ముమ్మరంగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • వ్యాక్సిన్ సమర్థవంతమైనదే..!

'స్పుత్నిక్‌-లైట్‌'(Sputnik Light) ప్రాణాంతక కరోనా వైరస్‌- డెల్టా వేరియంట్‌ నుంచి 70 శాతం రక్షణ కల్పిస్తుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (ఆర్​డీఐఎఫ్​) పేర్కొంది. కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ను స్పుత్నిక్ లైట్ 83 శాతం అడ్డుకుంటుందని.. అలాగే ఆసుపత్రిలో చేరే ముప్పును 94 శాతం తగ్గిస్తుందని ఆర్​డీఐఎఫ్​ వెల్లడించింది.

  • విలీన ప్రతిపాదన రద్దు

జీ ఎంటర్​టైన్​మెంట్​తో విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నామని (Reliance Zee Merger) రిలయన్స్​ ప్రకటించింది. గోయెంకా, ఇన్వెస్కోల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఇబ్బందికర లావాదేవీలను కోరుకోవట్లేదని స్పష్టం చేసింది.

04:21 October 14

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

  • మిగులుతో వెలుగులు

దేశచరిత్రలో ఎన్నడూ లేనిస్థాయిలో విద్యుత్‌ అమ్మకపు ధరలు మండిపోతున్నాయి. ఇతర రాష్ట్రాలు గరిష్ఠంగా రూ.20కి యూనిట్‌ చొప్పున కొంటుండగా.. తెలంగాణలో మిగులు విద్యుత్‌ ఉండటంతో రోజుకు 2 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) దాకా ఐఈఎక్స్‌లో రాష్ట్రం విక్రయిస్తోంది. 

  • నేటి నుంచే గెజిట్​ అమలు

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ నేటి నుంచి అమల్లోకి రానుంది.  అన్ని ప్రాజెక్టులు కాకుండా రాష్ట్రాలు సమ్మతి తెలిపే ప్రాజెక్టులను బోర్డులు మొదట తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. కృష్ణాకు సంబంధించి బోర్డు రూపొందించిన 15 ఔట్ లెట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలపాల్సి ఉంది. ప్రభుత్వాలు అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. 

  • టాప్​లో తెలంగాణ

  • కన్నుల పండువగా..

రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి. తీరొక్క పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలన్ని నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. ఉయ్యాల పాటలు.. గాజుల చేతుల చప్పట్లతో వీధులన్ని మారుమోగాయి.

  • ఆర్థికానికి కొవిడ్​ కాటు

  • సమాచార హక్కు చట్టానికి సంకెళ్లు!

సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి ఒరటిన్నర దశాబ్దం పూర్తయినా.. కేంద్రం, రాష్ట్రాలు ఆ చట్టానికి ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు తక్కువ అని నిపుణులు విమర్శిస్తున్నారు. పాలకుల అలక్ష్యం.. రాష్ట్రాల వారీగా సమాచార హక్కుకు సంకెళ్లు బిగిస్తోందని పేర్కొన్నారు.

  • ఘోర ప్రమాదం

గాజియాబాద్​లో జరిగిన బస్సు ప్రమాదంలో (Ghaziabad News) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. పలువురు బస్సులో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  • కొనసాగలేము..

  • ఫైనల్​కు కోల్​కతా

ఐపీఎల్​ క్వాలిఫయర్స్​-2 మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాట్స్​మెన్​ అదరగొట్టారు. దిల్లీ క్యాపిటల్స్​ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్​ 19.5 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్​ ఫైనల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు అడుగుపెట్టింది.

  • ఫుల్​ సిట్టింగ్​తో..

ఆంధ్రప్రదేశ్​లోని సినిమా ప్రేక్షకులకు శుభవార్త. గురువారం నుంచి అన్ని థియేటర్లలోకి వందశాతం ప్రేక్షకుల్ని అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దసరాకు రిలీజయ్యే చిత్రాలకు లైన్ క్లియర్ అయింది.

Last Updated : Oct 14, 2021, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.