ETV Bharat / state

'అలా చేస్తే మేడిగడ్డపై భారం తగ్గేది - అన్ని సమస్యలకు మూలం అదే' - KALESHWARAM PROJECT INQUIRY UPDATE

మేడిగడ్డ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచారు - తుమ్మిడిహెట్టిని పరిశీలిస్తే మేడిగడ్డపై భారం తగ్గేది- కాళేశ్వరంపై సాంకేతిక కమిటీ నివేదికలో అభిప్రాయం

MEDIGADDA Project Inquiry Update
Kaleshwaram Project Inquiry Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 9:51 AM IST

Kaleshwaram Project Inquiry Update : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలలో ముఖ్యమైన పనులకు సంబంధించి నాణ్యత వ్యవస్థ సరిగా లేదని నిర్వహణలోనూ లోపాలు వెల్లడయ్యాయని నిపుణుల కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. బ్యారేజీలను వాడటం మొదలుపెట్టాక నిర్మాణంలో కొన్ని లోపాలు వెలుగు చూసినా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రంగా పెరిగి మేడిగడ్డ బ్యారేజీకి పైపింగ్‌ ఏర్పడిందని నివేదిక అభిప్రాయపడినట్లు తెలిసింది.

మేడిగడ్డలో సీకెంట్‌ ఫైల్స్‌ పద్ధతిని అమలు చేయాలనుకొనేటప్పుడు దీనిపై తగిన అధ్యయనం చేయలేదని తెలిపినట్లు సమాచారం. మేడిగడ్డ నుంచి నీటిని భారీగా ఎత్తిపోసేందుకు 13 మీటర్ల హైడ్రాలిక్‌ హెడ్‌ను తీసుకోవడం, 90 రోజులు నీటిని ఎత్తిపోయడానికి బ్యారేజీలో 90 రోజుల పాటు నీరు నిల్వ ఉంచడం వంటి అంశాలను లోపాలుగా నిపుణుల కమిటీ తెలిపినట్లు తెలిసింది.

భారం మొత్తం మేడిగడ్డమీద వేయకుండా తుమ్మిడిహెట్టి నుంచి 60 టీఎంసీల నీటిని మళ్లించే అంశాన్ని పరిశీలిస్తే బాగుండేదని అభిప్రాయపడినట్లు సమాచారం. కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ సాంకేతిక అంశాలపై తమకు సాయపడేందుకు నీటిపారుదల శాఖ నిపుణులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది.

మేడిగడ్డ నుంచే 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించడం, పలు దశల్లో లిఫ్టింగ్‌ ఉండటంతో నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పంపింగ్‌కు అవసరమైన అధిక నీటిమట్టం నిర్వహించాల్సి వచ్చినందున బ్యారేజీలను అనివార్యంగా స్టోరేజీ రిజర్వాయర్లుగా మార్చాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా బ్యారేజీ స్ట్రక్చరల్‌ డిజైన్లలో మార్పులు చేయడంతో నిర్మాణంతోపాటు నిర్వహణలోనూ లోపాలు జరిగాయని కమిటీ పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

బ్యారేజీని మినీ డ్యామ్​గా వినియోగించడం : ఎత్తిపోతల సామర్థ్యం పెంచడంతో మేడిగడ్డలో నీటి నిల్వను మూడు టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచాల్సి వచ్చిందని ఈ కారణంగా పంపుహౌస్‌ వద్ద ఎల్‌.డబ్ల్యూ.ఎల్‌(లెంత్‌ వాటర్‌ లైన్‌)ను 93.5 మీటర్లుగా, ఎం.డి.డి.ఎల్‌.(మినిమమ్‌ డ్రాడౌన్‌ లెవల్‌)ను 99 మీటర్లుగా నిర్ణయించాల్సి వచ్చిందని నివేదికలో పొందిపరిచినట్లు సమాచారం. ఇది మొత్తం బ్యారేజీపై ప్రభావం చూపిందని సమాచారం. కట్‌ ఆఫ్‌ వాల్‌ డెప్త్‌ నుంచి, ఆర్‌.సి.సి. రాఫ్ట్‌ పొడవును పెంచడం వంటివి జరిగింది.

పియర్ల సైజును బాగా పెంచడం, గేట్లలో మార్పు చేయడం, బ్యారేజీని మినీ డ్యాంగా వినియోగించడం వల్ల సమస్యలు వచ్చాయని వివరించినట్లు తెలిసింది. ఎక్కువ రోజులు నీటిని నిల్వ చేయాల్సి రావడంతో ఎక్కువ హైడ్రాలిక్‌ హెడ్‌ మట్టాన్ని నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. దీనివల్ల నీటి మళ్లింపు పథకం కాస్తా నీటి నిల్వ పథకంగా మారిందని నిపుణుల కమిటీ పేర్కొన్నట్లు సమాచారం.

"సీకెంట్‌ ఫైల్స్‌లో గ్యాప్​ల కారణంగా వాటి కిందున్న ఇసుకలోకి నీరు ఇంకింది. దీంతో మెల్లమెల్లగా ఆ ఇసుక కొట్టుకుపోవడంతో దిగువ ఖాళీ ఏర్పడి పైపింగ్‌ జరిగి ఉండొచ్చు. మూడు బ్యారేజీలలో వేర్వేరు డిజైన్లు, అప్రోచ్‌లను అవలంబించినా ఏ బ్యారేజీకి డిజైన్‌ను కూడా థర్డ్‌ పార్టీతో పరిశీలనకు పంపలేదు. ఈ ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకొంటే తుమ్మిడిహెట్టి వద్ద స్థలమే మెరుగైంది." -నిపుణుల కమిటీ

'మేడిగడ్డ కుంగుబాటుకు కారణమేంటి? - ఏమో? తెలియదు గుర్తులేదు చెప్పలేను'

మేడిగడ్డ డ్యామేజీకి అదే ప్రధాన కారణం - విచారణలో ఈఎన్సీ హరిరామ్‌ కీలక విషయాల వెల్లడి - PC Ghosh Commission Inquiry

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.