ఏపీలోని అనంతపురంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. నగరంలో మిఠాయి కేంద్రాల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో స్వీట్లు కొనుగోలు చేస్తున్నారు. క్లాక్ టవర్ వద్ద ఉన్న ఓ దుకాణం గత 18 ఏళ్లుగా కొత్త సంవత్సరం రోజు రకరకాల మిఠాయిలతో దేవుని ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు.
నూతన సంవత్సరంలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని.. తొమ్మిది రకాల మిఠాయిలతో రెండు అడుగుల ఎత్తు గల వినాయక ప్రతిమను ఈసారి ఏర్పాటు చేశారు. 30 కేజీలు ఉన్నా ఈ ప్రతిమ దుకాణం ముందు ఏర్పాటు చేశారు. దీనిని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొత్త సంవత్సరం రాకతో నగరంలోని మిఠాయి దుకాణాల్లో సందడి నెలకొన్నాయి.
ఇదీ చదవండి: విదేశీ డిగ్రీలను అనుమతించాలని హైకోర్టులో పిల్