తెలంగాణ భవన్లో నూతన సంవత్సరం సందడి నెలకొంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సుమారు ఐదు గంటల పాటు కేటీఆర్ పార్టీ శ్రేణులను కలసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, తెరాస లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, పల్లా రాజేశ్వరరెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, తదితర నేతలు కేటీఆర్‌ను కలిశారు.
దేశపతి శ్రీనివాస్ రచించి పాడిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తి గీతాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన తెరాస నాయకుడు విద్యాసాగర్ బహుకరించిన అంబులెన్స్‌ను మంత్రి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
మరోవైపు... ఆగ్రోస్ సంస్థ మాజీ ఛైర్మన్ లింగంపల్లి కిషన్ రావు ట్రాక్టర్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ వరంగల్ జిల్లాకు చెందిన సరోజన అనే మహిళ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగింది.
ఇదీ చూడండి : నూతన అవకాశాల సంవత్సరమిది!