రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు త్వరలోనే పూర్తిస్థాయి ఉపకులపతులు రానున్నారు. వైస్ఛాన్స్లర్ల నియామకం కోసం గతంలోనే సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఉపకులపతులను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. వివిధ కారణాల రీత్యా ఆ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా వీలైనంత త్వరగా వైస్ఛాన్స్లర్ల నియామకాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
నియామకానికి సంబంధించి తుది కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. సంక్రాంతి లోపు లేదా పండగ పూర్తైన వెంటనే ఉపకులపతులను నియమించవచ్చని అంటున్నారు. పూర్తి స్థాయి ఉపకులపతులు లేకపోవడంతో పలు యూనివర్సిటీలకు ఐఏఎస్ అధికారులు ఇన్ఛార్జి వైస్ఛాన్స్లర్లుగా కొనసాగుతున్నారు.
ఇవీ చూడండి: ప్రతిధ్వని: భవిష్యత్తులో ఎలాంటి అంకురాలకు అవకాశం ఉంది?