ETV Bharat / city

'కొత్త వేరియంట్​ ఆనవాళ్లు ఇప్పటివరకు లేవు' - ap health dept on new variant of the corona

కరోనా వైరస్ కొత్త వేరియంట్​కు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్​ వైద్యారోగ్యశాఖ ప్రకటన చేసింది. ఏపీలో ఎలాంటి ఆనవాళ్లు ఇప్పటివరకు బయటపడలేదని వెల్లడించింది.

new-variant-of-the-corona-virus-have-not-yet-appeared-in-andhrapradesh
'కొత్త వేరియంట్​ ఆనవాళ్లు ఇప్పటివరకు లేవు'
author img

By

Published : Dec 28, 2020, 11:01 PM IST

కరోనా వైరస్ కొత్త వేరియంట్​కు సంబంధించిన ఆనవాళ్లు ఏపీలో ఇంకా బయటపడలేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. పుణెలోని వైరాలజీ ల్యాబ్, సీసీఎంబీల నుంచి నివేదికలు ఇంకా రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 1363 మంది యూకే నుంచి ఆంధ్రప్రదేశ్​కు వచ్చారని..ఇందులో 1346 మందిని గుర్తించి క్వారంటైన్​కు పంపించామని వెల్లడించారు. మరో 17 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని వివరించారు.

యూకే నుంచి వచ్చిన వారిలో 11 మందికి ఇప్పటివరకూ కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యిందని తెలిపారు. అనంతపురం 1, తూర్పుగోదావరి 2, కృష్ణా 3, గుంటూరు 4, నెల్లూరులో ఒకరు ఉన్నారని పేర్కొన్నారు. యూకే నుంచి వచ్చిన వారి బంధువులు, కాంటాక్టు అయిన వ్యక్తులను కూడా గుర్తించి పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. వారి సంబంధీకుల్లో 12 మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని వివరించింది.

ఇదీ చదవండి : వీడియో వైరల్​: పోటీలు పెట్టుకున్నారు.. ఆపై కొట్టుకున్నారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.