ETV Bharat / city

నూతన మద్యం విధానం... పెరిగిన ఆదాయం - Telangana in high spirits as liquor sales

నూతన విధానంలో మద్యం అమ్మకాలతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,467 కోట్లు ఆయాచిత రాబడి వచ్చింది. గురువారంతో మద్యం దుకాణాల లైసెన్సీల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం వల్ల దరఖాస్తుల ద్వారా రూ.975.68 కోట్లు రాబడి వచ్చినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.

నూతన మద్యం విధానం... పెరిగిన ఆదాయం
author img

By

Published : Oct 25, 2019, 10:21 AM IST

తెలంగాణ రాష్ట్రంలో విక్రయాలకు సంబంధం లేకుండానే మద్యం విధానంలో తెచ్చిన మార్పులు, చేర్పుల కారణంగా రూ.1,467 కోట్లు రాబడి ప్రభుత్వానికి చేకూరింది. 2019-21 సంవత్సరాలకు చెంది అబ్కారీ శాఖ నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. ఇందులో గతంలో ఉన్న నాలుగు స్లాబులను ఆరు శ్లాబులుగా విస్తరించింది. బీరుపై ఇప్పటి వరకు లైసెన్స్‌దారులకు 25శాతం మార్జిన్‌ ఇచ్చేది... కాని దానిని 20శాతానికి తగ్గించడం ద్వారా ఏడాదికి రూ.200 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని అబ్కారీ శాఖ అంచానా వేసింది.

రీటేల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ ద్వారా వచ్చిన రాబడి రూ.111 కోట్లు
ఇక ప్రతి దుకాణదారుడి నుంచి ప్రత్యేక రీటేల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ ద్వారా రూ.111 కోట్లు, గతంలో ఉన్న నాలుగు శ్లాబులను ఆరు శ్లాబులకు పెంచడం ద్వారా రూ.152 కోట్లు అదనంగా వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది. లైసెన్స్​లు ఎక్సైజ్‌ ట్యాక్స్‌ విలువకు ఏడు రెట్లు మించి మద్యం అమ్మినట్లయితే అదనంగా జరిగిన విక్రయాలపై విధించే టర్నోవర్‌ ట్యాక్స్‌ కింద మరో రూ.28 కోట్లు వరకు వస్తుందని భావిస్తున్నారు.

ఒక్క దరఖాస్తుకు రెండు లక్షలు వసూలు
వెనక్కి తిరిగి ఇవ్వని ఫీజు కింద దరఖాస్తుకు రెండు లక్షల లెక్కన వసూలు చేయడం వల్ల 2216 దుకాణాల ఏర్పాటుకు 48,784 దరఖాస్తులు రావడం... దాని ద్వారా రూ.975.68 కోట్లు వచ్చినట్లు అబ్కారీ శాఖ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ వివరించారు.

నూతన మద్యం టెండర్లు - సంస్కరణలు

  • దరఖాస్తు చేసుకునే విధానం సులభతరం
  • ఇఎండీ రూ.5లక్షలు చెల్లించాల్సిన అవసరం లేదు
  • లైసెన్స్‌ ఫీజు ఆరు విడతల్లో చెల్లించాల్సిన మొత్తాలను ఎనిమిది విడతల్లో చెల్లించే వెసులుబాటు
  • గతంలో 65 లైసెన్స్‌ ఫీజుకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చే మొత్తం.. 65శాతం నుంచి 50శాతానికి తగ్గింది.

లైసెన్స్‌లు- అబ్కారీ శాఖ లెక్కలు

  1. 2015-17లో మద్యం దుకాణాల ఏర్పాటుకు 30,990 ధరఖాస్తులు వచ్చి ఒక్కో దరఖాస్తునకు రూ.50వేలు లెక్కన కేవలం రూ.155 కోట్లు రాబడి వచ్చింది.
  2. గత 2017-19లో 41,119 దరఖాస్తులు వచ్చాయి. రుసుం లక్షకు పెంచగా రూ.411.19 కోట్లు రాబడి వచ్చింది.
  3. ఈ ఏడాది నవంబరు నెల నుంచి అమలులోకి రానున్న నూతన విధానంలో అనేక మార్పులు చేర్పులు చేయడం వల్ల అబ్కారీ శాఖకు రాబడి ఇబ్బడి ముబ్బడిగా వచ్చింది. దరఖాస్తులు కూడా ఏకంగా 48784 రావడం రెండు లక్షలకు దరఖాస్తు రుసుం పెంచడం వల్ల ఏకంగా రూ.975.68 కోట్లు రాబడి వచ్చింది.

దుకాణాల కోసం లిక్కర్‌ వ్యాపారుల పోటీ

ఏడాది వచ్చిన దరఖాస్తులు
2015-17 ఒక్కో దుకాణానికి 14 దరఖాస్తులు
2017-19 ఒక్కో దుకాణానికి 19 దరఖాస్తులు
2019-21 ఒక్కో దుకాణానికి 22 దరఖాస్తులు

ఇవీ చూడండి: ఆదివాసీల జోలికొస్తే ఊరుకోం: ఎంపీ బాపురావు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.