ETV Bharat / city

ఏపీలో మరో పారిశ్రామిక కారిడార్​... కర్నూలు జిల్లాలో క్లస్టర్​ - ఏపీ పారిశ్రామిక వార్తలు

ఏపీలో మరో కొత్త పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. హైదరాబాద్ - బెంగళూరుల మధ్య ఈ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పారిశ్రామిక కారిడార్​తో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ కీలకమైన క్లస్టర్​గా మారనుంది.

new-industrial-corridor-in-ap-which-is-across-ap-telangana-and-karnataka
ఏపీలో మరో పారిశ్రామిక కారిడార్​... కర్నూలు జిల్లాలో క్లస్టర్​
author img

By

Published : Sep 30, 2020, 9:09 AM IST

హైదరాబాద్ - బెంగళూరు నగరాల మధ్య మరో కొత్త పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకానుంది. తెలంగాణ- ఏపీ- కర్ణాటక రాష్ట్రాలలో ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా విద్యుత్ పరికరాల తయారీ సహా ఇతర సాంకేతిక ఉత్పత్తుల పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఏపీ భావిస్తోంది. కేంద్ర సహకారంతో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తామని ఏపీ పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్​మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ద్వారా మరో కారిడార్​కు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

మూడు పారిశ్రామిక కారిడార్​లు

హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్​లో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ నోడ్​గా ఉండనుంది. కడప జిల్లాలోని కొప్పర్తి విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్​లో, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం, చిత్తూరు జిల్లాలోని రౌతుసురుమల నోడ్ ద్వారా చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కింద అభివృద్ధి కానుంది. ఈ కారిడార్​తో కలిపి రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పరిశ్రమలకు పుష్కలంగా నీటి సరఫరాతో పాటు ప్రత్యేక విద్యుత్ లైన్లు, లాజిస్టిక్ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.

తిరుపతిలో ఐటీ పార్కు

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పారిశ్రామిక క్లస్టర్లలో సమీకృత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్​ల నిర్మాణంపైనా ప్రభుత్వం వేగం పెంచింది. మరోవైపు తిరుపతిలో ఐటీ పార్కు ఏర్పాటు కోసం కపిల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

ఇవీ చూడండి: ఎల్​టీ, హెచ్​టీ కనెక్షన్ల ఆధారంగా ఆన్​లైన్​లో పరిశ్రమల లెక్క

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.