రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వైరస్ బారిన 2,48,891 మంది పడ్డారు. నేటికి కరోనా మహమ్మారితో 1,372 మంది మరణించారు. మరో 937 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 2,27,583 మంది కొవిడ్‌ను జయించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 19,936 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 17,134 మంది ఉండగా... మిగతా వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 296 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి.
జాతీయ సగటుతో పోలిస్తే మూడో రోజు వరుసగా రాష్ట్రంలో రికవరీ రేటు పడిపోయింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో రికవరీల సంఖ్య తగ్గి, కరోనా కేసులు ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో 92.4 శాతం రికవరీలు ఉండగా... రాష్ట్రంలో 91.43శాతంగా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా 44,644మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 1,607మందికి వైరస్ సోకినట్టు ప్రకటించింది. మరో 535మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు పేర్కొంది.
ఆదిలాబాద్ లో 14, భద్రాద్రి కొత్తగూడెం 124, జగిత్యాల 42, జనగామ 29, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులాంబ గద్వాల 9, కామారెడ్డి 30, కరీంనగర్ 78, ఖమ్మం 84, కుమురం భీం ఆసిఫాబాద్ 14, మహబూబ్‌నగర్ 23, మహబూబాబాద్ 28, మంచిర్యాల 30, మెదక్ 19, మేడ్చల్ మల్కాజిగిరి 113, ములుగు 37, నాగర్‌కర్నూల్ 43, నల్గొండ 67,నిర్మల్ 16, నిజామాబాద్ 23, పెద్దపల్లి 26, రాజన్న సిరిసిల్ల 30, రంగారెడ్డి 115 సంగారెడ్డి 41, సిద్దిపేట 69, సూర్యాపేట 46, వికారాబాద్ 16, వనపర్తి 22, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ 48, యాదాద్రి భువనగిరిలో 29 కేసులు నమోదయ్యాయి. నారాయణపేటలో కొత్త కేసులు నమోదుకాకపోవటం గమనార్హం.
ఇదీ చూడండి: 10 ఉపగ్రహాలతో నేడు నింగిలోకి పీఎస్ఎల్వీసీ 49