రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా... రాష్ట్రంలో మరో 181 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి మరో 163 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 1,872 యాక్టివ్ కేసులున్నాయి.
ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 733 మంది బాధితులుండగా... జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 44 కరోనా కేసులు నమోదయ్యాయి.