గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2176 మందికి కరోనా మహమ్మారి సోకింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య లక్షా 79వేల 246కి చేరింది. మరో 2004మంది కోలుకోగా ఇప్పటి వరకు లక్షా 48వేల 139 మంది కోలుకున్నారు. ఇక తాజాగా 8 మంది మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించగా... మొత్తం 1070 మంది మహమ్మారికి బలయ్యారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉండటం గమనార్హం.
వైరస్ భారిన పడిన వారిలో చాలా స్వల్పమాత్రంగా మాత్రమే మరణిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం 30 వేల 37మంది వైరస్‌తో బాధపడుతుండగా... అందులో 23వేల 929 మంది కేవలం ఐసోలేషన్‌లో ఉన్నట్టు సర్కారు పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 26 లక్షల 84 వేల 215 మంది కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడినవారిలో దాదాపు 70శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకపోగా కేవలం 30శాతం మంది మాత్రమే వైరస్ లక్షణాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
ఇక కోవిడ్ మరణాల రేటు రోజు రోజుకు తగ్గుతోంది. ఇప్పటి వరకు మృతి చెందినవారిలో సైతం వైరస్‌తో 46.13శాతం మరణించగా... ఇతరత్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కొవిడ్ బారిన పడిన వారు 53.87శాతం మరణించినట్టు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఆదిలాబాద్ 25, భద్రాద్రి కొత్తగూడెం 88, జీహెచ్ఎంసీ 308, జగిత్యాల 40, జనగామ 24, జయశంకర్ భూపాలపల్లి 20, జోగులాంబ గద్వాల22, కామారెడ్డి 48, కరీంనగర్ 120, ఖమ్మం 86, కొమరంభీం ఆసిఫాబాద్ 22, మహబూబ్ నగర్ 36, మహబూబాబాద్ 68, మంచిర్యాల 44, మెదక్ 41, మల్కాజ్ గిరి 151, ములుగు 26, నాగర్ కర్నూల్ 47, నల్గొండ 136, నారాయణపేట 12, నిర్మల్ 21, నిజామాబాద్ 68, పెద్దపల్లి 42, సిరిసిల్ల 56, రంగారెడ్డి 168, సంగారెడ్డి 67, సిద్దిపేట 95, సూర్యాపేట 82, వికారాబాద్ 19, వనపర్తి 43, వరంగల్ రూరల్ 34, వరంగల్ అర్బన్ 77, యాదాద్రి భువనగిరి 40 చొప్పున నమోదయ్యాయి.
ఇక తాజాగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను సైతం పెంచుతోంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 82 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇవీ చూడండి: దేశంలో కొత్తగా 86,508 మందికి కరోనా