ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా మరో 8,835 కరోనా కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిసి ఏపీలో కరోనా బాధితుల సంఖ్య... 5,92,760కి చేరింది. కొవిడ్ బారిన పడి ఇప్పటివరకు 5,105 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం 90,279 కరోనా యాక్టివ్ కేసులుండగా... కొవిడ్ నుంచి 4,97,376 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 75,013 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లండించారు.