తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పెంచింది. ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వ నిర్ణయించింది. 18వ తేదీన పురపాలక సంఘాల పరిధిలో లాటరీ ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నారు. అదేవిధంగా 19న జీహెచ్ఎంసీ పరిధిలో ఎంపిక జరుగుతుందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 159 బార్లు ఏర్పాటుకు నిన్నతో గడువు ముగిసిప్పటికీ... 7,360 దరఖాస్తులు వచ్చాయి. అధికారుల అంచనాకు మించి సోమవారం ఒక్కరోజే 5,311 మంది పోటీ పడ్డారు. దీంతో... ఇంకా దరఖాస్తులు వచ్చే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుతో పాటు తిరిగి ఇవ్వని రుసుము కింద లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీంతో నిన్నటి వరకు ప్రభుత్వానికి రూ. 73.60 కోట్లు ఆదాయం వచ్చింది. గడువు పెంచడం ద్వారా…మరో మూడు వేల దరఖాస్తులు వచ్చినా... దరఖాస్తుల రుసుము రూ. 100 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: స్థలం కబ్జా అయిందని 70 ఏళ్ల బామ్మ ఆందోళన