గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 402 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 79 వేల 339కు చేరింది.
వైరస్ కారణంగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 978 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ బారినుంచి 412 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8.68 లక్షలకు చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చూడండి: చర్చలపై బుధవారం రైతు సంఘాల కీలక భేటీ