ETV Bharat / city

'అవును.. రియల్ ఎస్టేట్​ చేస్తున్నా.. తప్పేముంది..?' - కోటంరెడ్డి కామెంట్స్

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఏపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్న తెదేపానేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపణల్ని.. ఆయన స్వీకరించారు. తాను రియల్ ఎస్టేట్​తో పాటు కాంట్రాక్టులు కూడా చేస్తున్నానని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు.

nellore-rural-mla-kotamreddy-on-real-estate-business

author img

By

Published : Jul 2, 2022, 7:56 PM IST

'అవును.. రియల్ ఎస్టేట్​ చేస్తున్నా.. తప్పేముంది..?'

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్న తెలుగుదేశం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపణల్ని.. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వీకరించారు. అయితే.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. రియల్ ఎస్టేట్‌, కాంట్రాక్టులూ చేయిస్తున్నానని వెల్లడించారు. దందాలు కాకుండా.. నిజాయితీగా వ్యాపారం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.

"రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టులు చేస్తున్నా. ఎమ్మెల్యేలు వ్యాపారం చేసుకుంటే తప్పేమిటి. వ్యాపారాలు చేసి ప్రజలకు సేవ చేస్తున్నా. రియల్ ఎస్టేట్​లో సంపాదించటం తప్పుకాదు. నెల్లూరు గ్రామీణంలోనే కాదు సూళ్లూరుపేట, తిరుపతి, చెన్నై, బెంగుళూరులో కూడా నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. సంపాదించిన డబ్బుతో పేదలకు సహాయం చేస్తున్నా. సైకిల్ మీద తిరిగే తాను ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా." - కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.