ETV Bharat / city

నీట్​ దరఖాస్తు గడువు పొడిగింపు - exam

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఇతర మెడికల్‌ కోర్సులకు సంబంధించి దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం కల్పించే నీట్‌పరీక్షకు దరఖాస్తు గడువు పెరిగింది. వెబ్​సైట్​ రద్దీ కారణంగా జనవరి 6వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని యంత్రాంగం సూచించింది.

neet date extended
నీట్​ దరఖాస్తు గడువు పొడిగింపు
author img

By

Published : Jan 1, 2020, 9:37 PM IST

Updated : Jan 1, 2020, 10:47 PM IST

వైద్య కళాశాలల్లో ప్రవేశానికి వీలు కలిపించే అర్హత పరీక్ష ‘నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌’కు (నీట్‌ యూజీ 2020) దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరి తేదీని జనవరి 6 రాత్రి 11:50కు పొడిగించారు. మొదట ఈ గడువు డిసెంబర్‌ 31, 2019గా ఉండేది. వెబ్‌సైట్‌లో ఏర్పడిన రద్దీ కారణంగా అనేక మంది విద్యార్థులు ఆ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయారు. గడువును పొడిగించాలంటూ అనేక విజ్ఞాపనలు అందుకున్నట్టు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యార్థుల సౌకర్యార్ధం నీట్‌ దరఖాస్తు గడువును పొడిగించినట్టు ఆ శాఖ అధికారులు వివరించారు. కాగా ఆన్‌లైన్‌ దరఖాస్తులో సవరణలు చేసుకునేందుకు గడువు యధాతధంగా అంటే జనవరి 15 నుంచి 31 వరకు ఉంటుందని వారు వివరించారు. ఇక కశ్మీరు లోయ, లెహ్‌, కార్గిల్‌ ప్రాంతాల అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్టీఏ) నిర్దేశించిన నోడల్‌ కేంద్రాల వద్ద అందచేయవచ్చు.

ఇవీ చూడండి: రెండేళ్లు ఆటకు దూరంగా ఉన్నా... నా కల నెరవేరింది: కోనేరు హంపి

TG_HYD_74_01_NEET_DATE_EXTEND_AV_3064645 reporter: Nageshwara Chary note: Pls Use File Visuals ( ) వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న నీట్.. దరఖాస్తుల గడువును ఈనెల 6వ తేదీ వరకు పొడిగించారు. నిన్నటి తో దరఖాస్తుల గడువు ముగిసినప్పటికీ.. వెబ్ సైట్ రద్దీ కారణంగా ఈనెల 6వ తేదీ అర్థరాత్రి వరకు పొడిగించినట్లు ఎన్ టీఏ ప్రకటించింది. నేటితో ముగియనున్న రుసుము చెల్లించే గడువును ఈనెల 7వతేదీ అర్థరాత్రి వరకు పొడిగించింది. దరఖాస్తుల్లో పొరపాట్లను సవరణ గడువు ఈనెల 15 నుంచి 31 వరకు యథాతథంగా ఉంటుందని ఎన్ టీఏ పేర్కొంది. కశ్మీర్, లేహ్, కార్గిల్ విద్యార్థులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నోడల్ కేంద్రాల్లో ఆఫ్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మే 3న జరగనున్న నీట్ పరీక్షకు... మార్చి 27 నుంచి హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. end
Last Updated : Jan 1, 2020, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.