దేవీ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని మహంకాళేశ్వర ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఆలయ అర్చకులు చండీ హోమం నిర్వహించి.. ఉంజల్ సేవ కార్యక్రమం జరిపారు.
నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారికి ప్రతిరోజు సుప్రభాత సేవ, మహాభిషేకం, చతుషష్ఠి ఉపాచర మహాపూజ, పారాయణం, చండీ హోమం, సామూహిక మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. అమ్మవారు సరస్వతీ అవతారంలో కొలువైనందున.. పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందించినట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి : రాష్ట్రమంతటా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు