ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్ పూర్లో జాతీయ గిరిజన కళాకారుల నృత్యోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబురాలకు రాష్ట్రం నుంచి గిరిజన కళాకారుల బృందం పాల్గొంది. నృత్యం ద్వారా గిరిజన సంస్కృతిని చాటేందుకే ఇక్కడకు వచ్చామని తెలంగాణ గిరిజన కళాకారులు తెలిపారు. గిరిజన నృత్యకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
గిరిజన సంస్కృతిని చాటేందుకే...
గిరిజనుల సంప్రదాయాలను చాటి చెప్పడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు. 2,500 మందికిపైగా నృత్య కళాకారులు ఈ ఉత్సవానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం... ఐక్యత సందేశాన్ని ఇచ్చిందని ప్రదర్శకారులు కొనియాడారు.
ఇవీ చూడండి : గిరిజన పండుగలో ప్రత్యేక ఆకర్షణగా 'రాహుల్ నృత్యం'