రక్తహీనతలో రాష్ట్ర సగటు 57.8 శాతం ..
15-49 ఏళ్ల మధ్య వయస్సున్న సాధారణ మహిళల్లో రక్తహీనతతో బాధపడుతున్నవారి రాష్ట్ర సగటు 57.8 శాతం కాగా.. ఈ అంశంలో అధికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 69.3 శాతం మంది, తక్కువగా సంగారెడ్డిలో 47.9 శాతం మంది ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
మహిళల్లో 18 ఏళ్లలోపు పెళ్లిళ్లు
ప్రస్తుతం 20-24 ఏళ్ల వయస్సున్న మహిళల్లో 18 ఏళ్లలోపు పెళ్లైనవారి రాష్ట్ర సగటు 23.5 శాతం కాగా.. ఈ కేటగిరీలో అత్యధికులు వికారాబాద్ జిల్లాలో 39.8 శాతం మంది, అతి తక్కువమంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10.6 శాతం మంది నమోదయ్యారు.
ఎత్తు తక్కువ చిన్నారులు..
ఐదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గట్లుగా ఎత్తు పెరగని వారు రాష్ట్ర సగటు 33.1 శాతం కాగా, అత్యధికంగా జోగులాంబ గద్వాలలో 49.7 శాతం మంది, అతి తక్కువగా కరీంనగర్‌లో 22.2 శాతం మంది ఉన్నారు.
వయసుకు తగ్గట్లుగా బరువు లేనివారు
ఐదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గట్లుగా బరువు లేనివారు రాష్ట్ర సగటు 31.8 శాతం మంది కాగా, అధికంగా ఆదిలాబాద్‌లో 52 శాతం మంది చిన్నారులు, అత్యల్పంగా హైదరాబాద్‌లో 18.9మంది ఉన్నట్లుగా గుర్తించారు.
అధిక బరువు
ఐదేళ్లలోపు పిల్లల్లో అధిక బరువున్నవారి రాష్ట్ర సగటు 3.4 శాతం కాగా, ఈ అంశంలో జనగామలో అధికంగా 6.4 శాతం మంది, తక్కువగా వికారాబాద్‌లో 0.8 శాతం మంది ఉన్నారు.
జగిత్యాలలో అత్యధికంగా
- 1,000 మంది బాలుర జనాభాకు బాలికల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్ర సగటు 1049.
- రాష్ట్ర సగటు కంటే తక్కువగా 1,000లోపు బాలికలున్నట్లుగా నమోదైన జిల్లాల్లో.. హైదరాబాద్(959), మేడ్చల్ మల్కాజిగిరి(996), వికారాబాద్(998), ఆదిలాబాద్(992) జిల్లాలున్నాయి. జగిత్యాలలో అత్యధికంగా 1,219 మంది బాలికలున్నారు.
కుమురం భీం జిల్లాలో
- రాష్ట్రంలో మధుమేహుల సగటు మహిళల్లో 14.7 శాతం, పురుషుల్లో 18.1 శాతంగా ఉంది.
- అధిక సంఖ్యలో హైదరాబాద్ మహిళల్లో 21.2 శాతం, పురుషుల్లో 26.8 శాతంగా ఉంది.
- తక్కువ సంఖ్యలో కుమురం భీం ఆసిఫాబాద్‌లో మహిళల్లో 8.4 శాతం, పురుషుల్లో 11.6 శాతంగా ఉంది.
నల్గొండ మహిళల్లో
- రాష్ట్రంలో అధిక రక్తపోటు సగటు మహిళల్లో 26.1 శాతం, పురుషుల్లో 31.4 శాతంగా ఉంది.
- అత్యధికంగా హైదరాబాద్ మహిళల్లో 30.2 శాతం, పురుషుల్లో 41.7 శాతంగా ఉంది.
- అత్యల్పంగా మహిళల్లో అధిక రక్తపోటు బాధితులున్న జిల్లాగా నల్గొండను గుర్తించారు. ఇక్కడ మహిళల్లో 19.6 శాతం మంది బీపీకి మందులు వాడుతున్నారు. పురుషుల్లో మాత్రం వనపర్తి జిల్లాలో 25.5 శాతం మంది ఉన్నారు.
ప్రసవ కోతల్లో...
- రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలుపుకొని సగటున 60.7 శాతం సిజేరియన్లు జరుగుతుండగా.. కరీంనగర్‌లో అధికంగా 82.4 శాతం, తక్కువగా కుమురం భీం జిల్లాలో 27.2 శాతం జరుగుతున్నాయి.
- ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లలో రాష్ట్ర సగటు 81.5 శాతం కాగా, రాష్ట్రం మొత్తమ్మీద ఎక్కువగా కాన్పు కోతలు జరుగుతున్న జిల్లాగా కరీంనగర్(92.8శాతం)ను గుర్తించారు. అతి తక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 65.8 శాతం జరుగుతున్నాయి.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ల రాష్ట్ర సగటు 44.5 శాతం కాగా, అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతున్నాయి. తక్కువగా కుమురం భీం జిల్లాలో 16.6 శాతం చేస్తున్నారు.
ఇవీ చూడండి: దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం!