lokesh letter to cm jagan: కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని గుర్తు చేశారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదన్న లోకేశ్.. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు.
గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, గడిచిన పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురి చేయకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కోరారు. తక్షణమే స్కూల్స్‌కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: