ETV Bharat / city

Nara Lokesh Comments: 'వృద్ధులపై దాడులు దారుణం.. వైకాపా పనైపోయింది..!' - telangana news

ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెప్పు కోసం 70 ఏళ్ల వృద్ధుడని పోలీసులు హింసించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ఈ ఘటన చూస్తే వైకాపా పనైపోయినట్లు అనిపిస్తోందని వెల్లడించారు.

Nara Lokesh Comments, nara lokesh news
నారా లోకేష్, నారా లోకేష్ లేటెస్ట్ అప్డేట్స్
author img

By

Published : Oct 27, 2021, 2:33 PM IST

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల నెపంపై పోలీసులు వృద్ధులను వేధించటం చూస్తుంటే... వైకాపా పనైపోయిందన్నది సుస్పష్టమవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెప్పు కోసం 70 ఏళ్ల వృద్ధుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉగాండాలో ఉన్న ఓబుల్ రెడ్డి... ఎమ్మెల్యే పనితీరుని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే ఆయన తండ్రిని పోలీస్ స్టేషన్​కి పిలిచి హెచ్చరించి, హింసించారని ఆరోపించారు.

  • సోషల్ మీడియాలో పోస్ట్ పేరుతో వృద్ధులను సైతం వేధించడం చూస్తుంటే వైసీపీ పనైపోయిందని స్పష్టమవుతోంది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెప్పు కోసం 70 ఏళ్ల వృద్ధుడు శ్రీనివాసరెడ్డి గారిని పోలీసులు హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/2) pic.twitter.com/dBL2rgsZCJ

    — Lokesh Nara (@naralokesh) October 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా నేతలు పోలీసు వ్యవస్థని జేబు సంస్థగా మార్చుకున్నారనేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ అని ధ్వజమెత్తారు. శ్రీనివాసరెడ్డి పోలీసు స్టేషన్​లో ఉన్న ఓ వీడియోను తన ట్విట్టర్​కు జత చేశారు.

  • ఉగాండాలో ఉన్న కొడుకు ఓబుల్ రెడ్డి ఎమ్మెల్యే పనితీరుని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే తండ్రి శ్రీనివాసరెడ్డిని పోలీస్ స్టేషన్ కి పిలిచి వార్నింగ్ ఇవ్వడం, టార్చర్ చెయ్యడం పోలీసు వ్యవస్థని వైసీపీ నేతలు జేబు సంస్థగా మార్చుకున్నారు అనడానికి ఒక ఉదాహరణ.(2/2)

ఇదీ చూడండి: Huzurabad by elections 2021: హుజూరాబాద్​లో కవర్ల కలకలం.. ఓపెన్ చేస్తే డబ్బులే డబ్బులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.