ETV Bharat / city

ధూళిపాళ్ల చేసిన తప్పేంటో సీఎం సమాధానం చెప్పాలి: నారా లోకేశ్ - Lokesh criticize on CM Jagan

ఏపీలోని విజయవాడలో ధూళిపాళ్ల నరేంద్రను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. ధూళిపాళ్ల చేసిన తప్పేంటో జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

lokesh visit dhulipala
ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
author img

By

Published : May 27, 2021, 8:43 AM IST

ఏపీ సీఎం జగన్‌ ఒక అమూల్‌ బేబీ.. అమూల్‌ డెయిరీ కోసం సీఎం ప్రజాధనం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని డెయిరీలన్నింటినీ.. గుజరాత్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రను లోకేశ్‌ విజయవాడలో పరామర్శించారు.

‘‘ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో జగన్‌రెడ్డి చెప్పాలి. పాడి రైతులకు రూ.4 ఎక్కువ ఇవ్వడం, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించడం తప్పా..? దశాబ్దాల నుంచి రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సంగం డెయిరీపై కక్ష సాధింపు దుర్మార్గం. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ జగన్‌ చేసిన కుట్రను నరేంద్ర బయటపెట్టారు. అందుకే ప్రభుత్వం ఆయన్ని వేధిస్తోంది. అమూల్‌ డెయిరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్ల ప్రజా ధనం వృథా చేయబోతోంది. రాష్ట్ర ఆస్తులను గుజరాత్‌ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు కక్షతో తెదేపా నేతలను జైలుకు పంపుతున్నారు. కొందరు అధికారులు.. చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. వారికి వడ్డీతో సహా.. తిరిగి చెల్లిస్తాం. ఇప్పటికైనా కక్ష సాధింపు పక్కన పెట్టి.. ప్రజల ప్రాణాలు కాపాడాలి’’ - నారా లోకేశ్, తెదేపా ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి: Black Fungus: మోతాదుకు మించి స్టెరాయిడ్ల వినియోగం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.