ETV Bharat / city

Nara Lokesh: మీ గుట్టు రట్టు చేశారనే భద్రత తొలగించారు: నారా లోకేశ్ - పయ్యావుల కేశవ్ భద్రత తొలగింపుపై నారాలోకేశ్ ఆగ్రహం

Nara Lokesh: ఉత్తర‌కొరియా నియంత‌ కిమ్‌ని ఏపీ సీఎం జగన్‌ మించిపోయారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వైకాపా ఫోన్ ట్యాపింగ్ గుట్టుర‌ట్టు చేశార‌నే అక్కసుతోనే కేశ‌వ్‌కు భద్రత తొల‌గించారని మండిపడ్డారు. ఈ క‌క్ష సాధింపుల‌తో.. వైకాపా స‌ర్కారు ఫోన్‌ ట్యాపింగ్ నిజ‌మేన‌ని ఒప్పుకున్నట్టే అని విమర్శించారు. త‌క్షణ‌మే కేశ‌వ్‌కు గ‌న్‌మెన్లను కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

నారా లోకేశ్
నారా లోకేశ్
author img

By

Published : Jul 11, 2022, 4:14 PM IST

Nara Lokesh: సీఎం జగన్‌.. ఉత్తర‌కొరియా అధ్యక్షుడు కిమ్‌ని మించిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైకాపాకు జీవితకాల అధ్యక్షుడిగా త‌న‌కి తానే ప్రక‌టించుకున్న జగన్‌.. రాష్ట్రానికి కూడా జీవితకాల ముఖ్యమంత్రిని అనుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. వైకాపా డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టుర‌ట్టు చేశార‌నే అక్కసుతో పీఏసీ ఛైర్మన్ ప‌య్యావుల కేశ‌వ్ సెక్యూరిటీ తొల‌గించేశారని మండిపడ్డారు.

ఇప్పటికే జ‌గ‌న్‌రెడ్డి ఆర్థిక ఉగ్రవాదాన్ని గ‌ణాంకాలతో స‌హా వెల్లడించిన కేశ‌వ్‌.. త‌న‌కు అద‌న‌పు భ‌ద్రత కావాల‌ని ప్రభుత్వాన్ని కోరితే ఉన్న సెక్యూరిటీ తొల‌గించేశారని దుయ్యబట్టారు. ఈ క‌క్ష సాధింపుల‌తో వైకాపా స‌ర్కారు వేల‌కోట్ల మాయం, ఫోన్ల ట్యాపింగ్ నిజ‌మేన‌ని ఒప్పుకున్నట్టే అని విమర్శించారు. త‌క్షణ‌మే కేశ‌వ్​కు అద‌న‌పు గ‌న్‌మెన్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సర్కారు సిద్ధం..'

అమర్​నాథ్​ యాత్ర పునఃప్రారంభం.. 4వేల మంది దర్శనానికి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.