ETV Bharat / city

Nara Lokesh Serious On YSRCP: నా తల్లిపై ఆరోపణలు చేసినవారిని వదలను: నారా లోకేశ్‌

author img

By

Published : Dec 22, 2021, 4:54 PM IST

Nara Lokesh Serious comments: తన తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టనని నారా లోకేశ్​ హెచ్చరించారు. తాను ఈ విషయంలో మెతక వైఖరితో ఉండబోనన్నారు.

Nara Lokesh Serious On YSRCP, lokesh comments on ap mla
వైకాపా నేతలపై నారా లోకేశ్ సీరియస్వైకాపా నేతలపై నారా లోకేశ్ సీరియస్

Nara Lokesh fires on YSRCP leaders: తన తల్లిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులకు తగిన రీతిలో బుద్ధి చెప్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. తన తండ్రిలాగా మెతక వైఖరితో ఉండనని.. గట్టిగా సమాధానం ఇస్తానని చెప్పారు. మంగళగిరిలో లోకేశ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవం కోరుకునే కుటుంబం తమదని.. 'మీ ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులపైనా ఇలాగే మాట్లాడతారా?' అని వైకాపా నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన మంత్రులు.. విదేశాల్లో జల్సాలు చేశారని ఆరోపించారు. ప్రజలను ఆదుకున్న తమపై నిందలు వేస్తారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు.

మంగళగిరి 28వ వార్డులో డంపింగ్‌ యార్డు తరలించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో గెలిచిన 10 రోజుల్లో డంపింగ్‌ యార్డును తరలిస్తానని చెప్పిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి 10 రోజులు పూర్తవ్వలేదా? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నివాసముంటున్న నియోజకవర్గంలోనే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే.. రాష్ట్రం పరిస్థితేంటని అన్నారు.

వైకాపా నేతలపై నారా లోకేశ్ సీరియస్

ఇదీ చదవండి: Jaggareddy letter to CM KCR: కేసీఆర్​కు జగ్గారెడ్డి 12 గంటల డెడ్​లైన్​... లేకుంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.