ఆంధ్రప్రదేశ్లో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దును డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) రేపు వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదించనున్నారు. కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని, పరీక్షల వాయిదాల పేరుతో వారిని మరింత ఆందోళనకు గురి చేయడం సబబు కాదని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: INTER: రెండో సంవత్సరం పరీక్షలు రద్దు చేసే అవకాశం