ETV Bharat / city

'అధర్మం అంతర్జాతీయ కోర్టుకెళ్లినా.. అంతిమ విజయం న్యాయానిదే' - lokesh today tweet

Nara Lokesh Tweet: ఏపీ మూడు రాజధానులపై కోర్టుకు వెళ్లడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ స్పందించారు. ఎక్కడికి వెళ్లినా చివరికి న్యాయమే గెలుస్తుందని ఆయన అన్నారు.

Nara Lokesh
Nara Lokesh
author img

By

Published : Sep 17, 2022, 7:53 PM IST

Nara Lokesh Tweet: ఆంధ్రప్రదేశ్​ రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ ఏపీ ప్రభుత్వం... సుప్రీంకోర్టుకు వెళ్లిన అంశంపై లోకేశ్‌ ట్వీటర్​ వేదికగా స్పందించారు. అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా... అంతిమ విజయం న్యాయానిదేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టంచేశారు.

  • అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా అంతిమ విజయం న్యాయానిదే.

    — Lokesh Nara (@naralokesh) September 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది: ఏపీకి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 3 రాజధానులు ఏర్పాటు చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని అమరావతే రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరింది.

రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదనడం సరికాదని సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్‌లో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించిందని... అది ఏపీ ప్రభుత్వానికి సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.