BALAKRISHNA: ఏపీలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్నింటిపైనా పన్నులు వేసి ప్రజల జీవనాన్ని దెబ్బతీసిందని.. నందమూరి బాలకృష్ణ విమర్శించారు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి... ఒక్కొక్కరిపై లక్షా 40 వేల భారం మోపిందని మండిపడ్డారు. ఈ ప్రజా వ్యతిరేక పాలనపై తెలుగుదేశం పోరాటం మొదలుపెట్టిందన్న బాలకృష్ణ.. ప్రజల్లోనూ తిరుగుబాటు వస్తోందని అన్నారు. గుంటూరు జేకీసీ రోడ్డులో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ను బాలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, కోవెలమూడి రవీంద్ర, నసీర్ అహ్మద్, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: యువతిపై నలుగురితో లైంగికదాడి చేయించి.. ఘాతుకాన్ని వీడియో తీసింది..!
చిలకలూరిపేటలో అఖండ సంబరాలు..: చిలకలూరిపేటలో అఖండ సినిమా 175 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినిమా ప్రదర్శిస్తున్న రామకృష్ణ థియేటర్‌లో జరిగిన వేడుకలకు.. నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. 175 రోజుల వేడుకల్లో భాగంగా కేకు కట్ చేసిన బాలయ్య.. నిర్మాత, ఎగ్జిబిటర్లు, దర్శకుడు, అభిమానులకు షీల్డులు అందజేశారు. అఖండ విజయాన్ని తన తండ్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు అంకితమిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.
ఇవీ చదవండి: