మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు ఘనవిజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెలవేర్చడంలో తెరాస విజయం సాధించిందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల గురించి అడుగుతామన్నారు. సీఏఏపై సీఎం కేసీఆర్ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నట్లు తెలిపారు. సీఏఏ, ఎన్పీఆర్కు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ఏ నాయకుడికీ ఇవ్వని గౌరవం... తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్కు ఇచ్చారని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 95 శాతం సక్సెస్ రేటు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. తమ పథకాలనే మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి:ఎన్నికల్లో తెరాస ఆలోచనను ఈసీ అమలు చేసింది'