ఉమ్మడి నల్గొండ జిల్లాల డీసీసీబీ ఛైర్మన్, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా సతీమణి, ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి హైదరాబాద్ కర్మాన్ఘాట్ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడమని స్వామిని వేడుకున్నట్లు గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి వైరస్ బారిన పడకుండా ఉండాలని సూచించారు.
- ఇదీ చూడండి: బిడ్డకోసం తనప్రాణాలను ఫణంగా పెట్టిన మాతృమూర్తి