ETV Bharat / city

జగన్ కోసం ఒప్పందాలను తుంగలో తొక్కారు: నాగం - సీఎంపై నాగం జనార్ధన్​రెడ్డి విమర్శలు

సీఎం కేసీఆర్​ కాంగ్రెస్​ నేత నాగం జనార్దన్​రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నీటి పారుదల శాఖపై మంత్రులకు కనీసం అవగాహన కూడా లేదని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడులో జగన్ తట్టమట్టి ఎత్తినా.. కేసీఆర్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్​ చేశారు. ఏపీ సీఎం కోసం కేసీఆర్​ ఒప్పందాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు.

nagam janardhan reddy counters to cm kcr
జగన్ కోసం ఒప్పందాలను తుంగలో తొక్కారు: నాగం
author img

By

Published : May 15, 2020, 4:03 PM IST

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కయారని కాంగ్రెస్​ నేత నాగం జనార్ధన్​రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్​ ప్రసంగమే ఇందుకు సాక్ష్యమన్నారు. జగన్ కోసం ఒప్పందాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. కేసీఆర్​ను తెలంగాణ ప్రజలు సీఎం చేసింది ఇందుకేనా అని ప్రశ్నించారు.

73,940 క్యూసెక్కులు డ్రా..

ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. 2018 లోనే నీరు దోపిడి చేస్తున్నా.. తెలంగాణ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 73,940 క్యూసెక్కులు డ్రా చేసుకుందని తెలిపారు. దీనిపై జనవరి నెలలో సీఎం కేసీఆర్​కి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

అవగాహన కూడా లేదు..

మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి మాటలు హాస్యాస్పదమని నాగం విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఒక్క టీఎంసీకే పరిమితం చేస్తే.. జిల్లా మంత్రులు నోరు విప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖపై మంత్రులకు కనీసం అవగాహన కూడా లేదని మండిపడ్డారు.

కమిషన్ల కోసమే కాళేశ్వరం..

పోతిరెడ్డిపాడు వెడల్పును అడ్డుకునేందుకు పోరాటం చేసిన చరిత్ర తనదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కాంగ్రెస్​కే దక్కుతుందన్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మించారని విమర్శించారు. దేవుళ్ల పేరుతో ప్రాజెక్ట్​లు పెట్టి.. దోపిడి చేసిన సీఎం కేసీఆర్​ అని ఆరోపించారు.

తట్టమట్టి ఎత్తినా..

సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఇది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉంది. అతి తక్కువ ఖర్చుతో పూర్తి కావల్సిన వాటిని ఎందుకు పక్కకు పెట్టారు. పోతిరెడ్డిపాడులో జగన్ తట్టమట్టి ఎత్తినా.. కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే. దక్షిణ తెలంగాణపై కేసీఆర్​ది సవితి తల్లి ప్రేమ. - నాగం జనార్ధన్​రెడ్డి, కాంగ్రెస్ నేత.

ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడు విషయంపై పీఎం, కేంద్ర మంత్రిని కలుస్తాం: కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.