ETV Bharat / city

చినుకుకే వణుకుతున్న మహానగరం.. నాలాలే కారణం - జీహెచ్​ఎంసీలో నాలాల ఆక్రమణలు

విశ్వనగరానికి తగ్గట్టుగా ప్రణాళికను అమలు చేయడంలో చిత్తశుద్ధి కరవవడం వల్ల నగరంలో చిన్న చినుకుకే వణకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ నాలా ఉందో ఎక్కడ రహదారి ఉందో తెలియని పరిస్థితి. అందుకే.. చాలామంది నాలాల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిపాటి వాన పడినా నాలాలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం అవి ఆక్రమణలకు గురి కావడమే. ఇక నాలాలకు పైకప్పులు వేసే పనులూ నత్తనడకన సాగుతున్నాయి. పలు కమిటీలు ఇచ్చిన నివేదికలు సైతం అటకెక్కించారు. ప్రస్తుతం 2 ప్రమాదాలు జరిగాక ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించామని చెబుతోంది.

naala aggressions in greater hyderabad municipal corporation
చినుకుకే వణుకుతున్న మహానగరం.. నాలాలే కారణం
author img

By

Published : Sep 22, 2020, 7:55 AM IST

చినుకుకే వణుకుతున్న మహానగరం.. నాలాలే కారణం

వానాకాలం వస్తుందంటే ఎక్కడ నిలిచే ప్రాంతాలున్నాయి?.. ఏయే ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుంది?.. ఎక్కడ నాలాలు పొంగే అవకాశం ఉంది? మ్యాన్‌హోళ్ల పరిస్థితి ఏంటి?.. వంటి విషయాలన్నింటిని ముందుగానే బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏం చేయాలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుసగా కురుస్తోన్న వానలకు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. మృత్యుకుహరాలుగా మారుతున్న నాలాల పనులు మూడేళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. నగరంలో నాలాల ఆక్రమణలు తొలగించడంతో పాటు విస్తరణ కోసం చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షాకాలం వస్తుందంటే గ్రేటర్​లో నాలాలపై చర్చ మొదలవుతుంది.

నాలాల విస్తరణ చేపట్టాలని నిర్ణయం

2000 సంవత్సరంలో నగరంలో భారీగా వర్షం కురిసింది. ఆ వర్షానికి హుస్సేన్‌సాగర్‌ నాలా పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లు మొత్తం నీట మునిగాయి. ఫలితంగా ఆ సమయంలో వరదముంపు ను నియంత్రించేందుకు నాలాల విస్తరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. నగరంలో నాలాల పొడవు 1221కిలోమీటర్లుగా ఉండగా అందులో ఓపెన్‌ నాలాలు 446కిలోమీటర్లు ఉన్నాయి. వీటిలో మేజర్‌ నాలాలు 391 కిలోమీటర్ల పొడవున్నాయి.

ఏళ్లు గడుస్తున్నా మార్పులేదు..

ఇతర వరద కాలువలు 55 కిలోమీటర్ల మేర ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఓపెన్ నాలాలే ఉన్నాయి. వాటిలో పూడిక తీయకపోవడం వల్ల కొద్దిపాటి వాన పడినా పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు పడినప్పడు ఈ నాలాలు, రహదార్లు ఏకమైపోతున్నాయి. అలాగే రోడ్లన్నీ బురదమయమై నడిచేందుకు కూడా స్థలం కనిపించకపోవడం వల్ల ప్రమాదమని తెలిసీ నాలాల పక్క నుంచే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ పైపుల్లో వ్యర్థాలు పేరుకుపోయి ఎక్కడిక్కడ నీరు నిలిచిపోతున్నాయి. ఫలితంగా మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతుండగా రోడ్లుచెరువుల్లా మారుతున్నాయి. నాలాలు, చెరువులపై అక్రమనిర్మాణాలు ఎక్కువవడం వల్ల మూసీలో కలవాల్సిన నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. వరదనీటిని నగరం నుంచి బయటకు పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. వాటి నివేదికలు కూడా వచ్చాయి. ఏళ్లు గడుస్తున్నా నాలాల పరిస్థితిలో మార్పులేదు. విస్తరణ సంగతేమో గానీ.. కబ్జాకు గురవడం మాత్రం ఆగలేదు.

ఆస్తుల సేకరణలో జాప్యం

నాలాలపై ఎన్ని ఆక్రమణలున్నాయి. ఎంతమేర విస్తరించాలన్నది నిర్ణయించేందుకు అప్పట్లో కిర్లోస్కర్‌ కమిటీ వేశారు. అప్పటి ఎంసీహెచ్‌లో 170కిలోమీటర్ల మేర ఉన్న 71 నాలాలను విస్తరించాలని ఆ కమిటీ నివేదిక సమర్పించింది. 10వేల ఆక్రమణల తొలగింపుతో పాటు విస్తరణకు 6,700కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. ఎంసీహెచ్ నుంచి జీహెచ్‌ఎంసీగా మారిన తరవాత వోయాంట్స్‌ కన్సల్టెన్సీ నాలాలపై సర్వే నిర్వహించింది. నగరంలో వరద ఇబ్బందులు తగ్గాలంటే 390 కిలోమీటర్ల మేర నాలాల విస్తరణ పనులు చేపట్టాలని సూచించింది. కమిటీ సూచనలకు అనుగుణంగా బల్దియా నాలాల విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. పనులు కూడా మొదలుపెట్టడం వల్ల నాలాలకు ఇరువైపులా ఉన్న ఆస్తుల సేకరణలో జాప్యం జరిగింది.

అధికార యంత్రాంగం విఫలం

నాలాల విస్తరణకు పరిహారం చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా ఆస్తుల సేకరణలో అధికారయంత్రాంగం విఫలమవుతోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ అడ్డంకులూ జాప్యానికి కారణమవుతున్నాయి. 2017 సంవత్సరంలో నగరంలో మరోసారి భారీగా వర్షాలు పడ్డాయి. ఆ సమయంలో వారం పాటు వరద.. బురదతో పాటు పలు కాలనీలు నీట మునిగాయి. శివారుప్రాంతాలు చెరువుల సమీపంలో బండారి లేఅవుట్ తో పాటు ఇతరప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ సెల్లార్లు, ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. అప్పుడు రాత్రి స్వయంగా మంత్రులే రంగంలోకి దిగి పరిస్థితి సమీక్షించారు. అప్పటికే నాలాల విస్తరణకు సంబంధించిన నివేదికలున్నా.. మళ్లీ అధ్యయనం చేయించారు. డ్రోన్‌ కెమెరాలతో చిత్రాల సేకరణ, రెవెన్యూ, నీటిపారుదల విభాగాల వద్ద ఉన్న వివరాల ఆధారంగా నాలాల వాస్తవ విస్తీర్ణం, ఆక్రమణల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు 7, 8 నెలల పాటు పనిచేశారు. నగరంలో 12,182 ఆక్రమణలున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీటి తొలగింపునకు 10 వేల కోట్లు ఖర్చు కానుందని అధికారయంత్రాంగం లెక్కలు వేసింది.

డ్రైనేజీల నిర్మాణానికి ప్రత్యేక కార్యక్రమం

భూ సేకరణ జరగకపోవడం వల్ల స్థలం అప్పగించలేదన్న కారణం చూపుతూ పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు కూడా రద్దు చేసుకున్నారు. గ్రేటర్‌లో 390కిలోమీటర్ల మేర ప్రధాననాలాలు ఉండగా.. చాలాప్రాంతాల్లో వాటికి పై కప్పులు లేవు. ప్రస్తుతం ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ ఓపెన్‌నాలాలపై క్యాపింగ్ బాక్స్ డ్రైనేజీల నిర్మాణానికి 300కోట్లతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. 2మీటర్ల కన్న తక్కువ వెడల్పు ఉన్న నాలాల్ని క్యాపింగ్ చేస్తామని...2 మీటర్ల కన్నా వెడల్పు అయిన నాలాలపై గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని వివరించారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైన ఆయన.. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ మంచిదే అయినా... ఎప్పటిలాగే అది ఆర్భాటాలకే పరిమితం కాకుండా ఉంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేదంటే...కథ మళ్లీ మొదటికే వస్తుంది.

ఇవీ చూడండి: భయం భయం: భాగ్యనగరంలో డెత్​ స్పాట్​లుగా మ్యాన్ హోళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.