ETV Bharat / city

ఏలూరు తరహా వ్యాధి లక్షణాలతో.. పూళ్లలో వింత రోగం కలకలం

author img

By

Published : Jan 20, 2021, 8:39 PM IST

పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతు ఉన్నట్టుండి మూర్చతో పొలంలో పడిపోయాడు. ఇంటి వద్ద టీ తాగుతున్న యువకుడు అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోగా.. కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఆడుకుంటున్న ఓ చిన్నారి.. నోటి నుంచి నురగలు కక్కుతూ సృహ తప్పి పడిపోయింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసిన వింత వ్యాధి లక్షణాలు.. భీమడోలు మండలం పూళ్లలో కొత్తగా కలకలం రేపాయి.

ఏలూరు తరహా వ్యాధి లక్షణాలతో.. పూళ్లలో వింత రోగం కలకలం
ఏలూరు తరహా వ్యాధి లక్షణాలతో.. పూళ్లలో వింత రోగం కలకలం

గత డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నగరాన్ని కుదిపేసిన ఈ తరహా వింత వ్యాధి తాజాగా భీమడోలు మండలం పూళ్లలో కలకలం రేపింది. ఈనెల 16 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ కాలనీకి చెందిన పలువురు .. మూర్చ, నోటిలో నుంచి నురగలు రావడం, ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలతో స్థానిక పీహెచ్​సీలో చేరారు. ఈ ఘటనలతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. చికిత్స అనంతరం వారిలో కొందరు కోలుకోగా.. మరో ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో 24 మంది పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

అధికారులు యుద్ధ ప్రాతిపదికన గ్రామంలో సూపర్ శానిటేషన్ చేసి.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏలూరు నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం.. ఇంటింటి సర్వే చేపట్టింది. బాధితులను ఉప ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని, స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు, కలెక్టర్ ముత్యాలరాజు, డీఎంహెచ్​వో సునంద పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెదేపా ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ ఇంఛార్జ్ బడేటి చంటి, తాడేపల్లిగూడెం జనసేన ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీను తదితరులు.. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. తాగునీరు, ఆహారం నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఏలూరులో గతంలో వెలుగుచూసిన వ్యాది, ఇప్పడు పూళ్లలో బయటపడినదీ ఒకటేనో కాదో తెలియాల్సి ఉంది. వైజ్ఞానికంగా అద్భుతాలు సృష్టిస్తున్న ప్రస్తుత సమయంలో.. ఈ వ్యాధి మూలాలు ఇంకా ఛేదించకపోవడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

ఇదీ చదవండి: హైకోర్టుకు వెళ్తుంటే.. కేకే కూతురు దాడి చేశారు : తహసీల్దార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.